
No Headline
ఆవు, లేగదూడ విక్రయించిన పూజారిపై ఫిర్యాదు
చందుర్తి(వేములవాడ): మండలంలోని నర్సింగపూర్–మోహినికుంట శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి ఓ భక్తులు ఇచ్చిన ఆవు, లేగదూడను పూజారి భద్రయ్య విక్రయించారని దేవాదాయ, ధర్మదాయశాఖ సహాయ కమిషనర్‌కు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నక్క గంగాధర్, సభ్యులు కాసారపు శ్రీనివాస్‌రెడ్డి, పెరుక గంగరాజు, చింతకుంట గంగాధర్, ఇల్లంతకుంట గణేశ్, కొత్త ఎల్లారెడ్డి, సంపునూరి దశరథం ఉన్నారు.
వెంకన్నకు క్షీరాభిషేకం
ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛవాలతో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీహవనం నిర్వహించారు.