World tallest man:పొడవులో ఘనాపాఠి

World tallest man: Sulemana Abdul Samed, Ghana Tallest Man At 7 Feet 4 Inches - Sakshi

ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు

త్వరలో గిన్నిస్‌ రికార్డుకెక్కే చాన్స్‌

అక్రా: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా టర్కీకి చెందిన 40 ఏళ్ల సుల్తాన్‌ సేన్‌ గతంలోనే గిన్నిస్‌ ప్రపంచ రికార్డులకెక్కాడు. అయితే, ఇతడిని దాటేసేందుకు ఘనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి నెలనెలా తెగ పెరిగిపోతున్నాడు. ఇతని పేరు సులేమనా అబ్దుల్‌ సమీద్‌. అందరిలా సాధారణ ఎత్తు ఉన్న సమీద్‌ 22 ఏళ్ల వయసులో  వేగంగా పెరగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి ఎత్తు కొలవమంటే వారి దగ్గర సరిపడా టేప్‌ లేదు.

ఒక ఎత్తయిన కర్ర తీసుకుని ఎత్తు తేల్చారు. అప్పుడు అతని ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు. గిన్నిస్‌లో స్థానం సంపాదించిన సుల్తాన్‌(ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు)ను త్వరలోనే దాటేస్తావని అందరూ తెగ పొగిడేశారు. సమీద్‌ ఇంకా ఎత్తు పెరుగుతుండటం గమనార్హం. కాగా ‘మార్ఫాన్‌ సిండ్రోమ్‌గా పిలిచే ఈ జన్యుసంబంధ వ్యాధి కారణంగా తీవ్ర గుండె సమస్యలు తలెత్తుతాయి. మెదడుకు శస్త్రచికిత్స చేసి ఇతని పెరుగుదలను ఆపాల్సి ఉంది’ అని వైద్యులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top