‘అదృష్టాన్ని’ పర్సులోనే దాచింది.. 290 కోట్ల లాటరీ!

Woman Carries Winning Lottery Ticket Worth USD 39 Million In Purse - Sakshi

బెర్లిన్‌: లాటరీ టికెట్‌ కొంటే లక్కీ డ్రా తేదీ కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తుంటారు చాలామంది. అలాంటిది ఒకావిడ తాను  లాటరీ టికెట్‌ కొన్న సంగతే మర్చిపోయింది. కొన్న టికెట్‌ తన పర్సులోనే ఉన్నా దానిని  వారాల పాటు ఆమె పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎలాగోలా లాటరీ ఫలితాల విషయం తెల్సి తన టికెట్‌ నంబర్‌ను చెక్‌ చేసుకుంది.

తను కొన్న టికెట్‌కే 39 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.290.53 కోట్ల) బంపర్‌ డ్రా తగిలిందనే విషయం తెలిసి సంభ్రమాశ్చర్యానికి గురైంది. ఈ ఘటన జర్మనీలో ఇటీవలే జరిగింది. జూన్‌ తొమ్మిదిన లాటరీ ఫలితాలు ప్రకటించారు. 1.20 యూరోలు (దాదాపు రూ.105) పెట్టి టికెట్‌ను కొని ఇన్నాళ్లూ ఆ సంగతే మర్చిపోయిన ఆమె.. ఇటీవలే తన లాటరీ టికెట్‌లోని ఏడు నంబర్లను సరిచూసుకుని ఆనందసాగరంలో మునిగిపోయారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top