Putin Blasts 'Neo-Nazis' in Ukraine on Holocaust Remembrance Day - Sakshi
Sakshi News home page

అందు కోసమే ఉక్రెయిన్‌పై దాడి! పుతిన్‌ సమర్థింపు

Jan 27 2023 5:55 PM | Updated on Jan 27 2023 6:07 PM

Vladimir Putin Repeated Claim Neo Nazis In Ukraine - Sakshi

చరిత్రలో పాఠాలను మరిచిపోవడం వల్లే భయంకరంమైన విషాధాలు పునారావృతమవుతాయి. వాటిని కట్టడి చేయాలంటే..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి తన వాదనను పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌పై దాడిని ప్రత్యేక సైనికి ఆపరేషన్‌గా చెబుతుండే పుతిన్‌ మరోసారి తన చర్యను సమర్థించుకునే దుస్సాహసం చేశారు. ఉక్రెయిన్‌లోని మాస్కో చర్యను డి నాజిఫై చేయడం కోసమేనంటూ వాదిస్తున్నారు. జనవరి 27 హోలోకాస్ట్‌ రిమెంబరెన్స్‌ డే పురస్కరించుకుని ఇలా పుతిన్‌ మరోసారి తన చర్యను సమర్థించుకునేందుకు యత్నించారు. చరిత్రలో పాఠాలను మరిచిపోవడం వల్లే భయంకరంమైన విషాధాలు పునారావృతమవుతాయని హెచ్చరిస్తున్నాడు పుతిన్‌.

అంతేగాదు ఉక్రెయిన్‌లో నియో నాజీలు పౌరులపై నిర్వహిస్తున్న నేరాలు శిక్షార్హమైనవేనని, వాటిని ప్రక్షాళన చేయాల్సిందేనని చెప్పారు. పైగా అక్కడ రష్యన్‌ మాట్లాడే వారిపట్ల ఉక్రెయిన్‌ వ్యవహరిస్తున్న తీరు నాజీ జర్మనీలతో పోల్చదగినదని పుతిన్‌ మద్దతుదారులు చెబుతున్నారు. ఈ మేరకు పుతిన్‌ తమ మాస్కో దళాల చర్యను దుర్మార్గానికి వ్యతిరేకంగా ధైర్యంగా సాగిస్తున్న పోరాటంగా అభివర్ణించారు. చివరికి పుతన్‌ ఉక్రెయిన్‌ పై దాడికి కారణం డీ నాజీఫైగా తేల్చి చెప్పారు.

ఐతే ఉక్రెయిన్‌ పుతిన్‌ వ్యాఖ్యలను ఖండించింది, తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కూడా. కాగా, అలాగే హిట్లర్‌ సైన్యంపై సోవియట్‌ విజయం రష్యన్ల దేశభక్తికి గర్వకారణమని పుతిన్‌ అన్నారు. అంతేగాదు నాజీయిజం నేరాలను, వాటి ఘోరమైన భావజాలానికి వ్యతిరేకంగా సాధించిన మహా విజయంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆక్రమిత పోలాండ్‌లో నాజీ జర్మన్‌ నిర్మించిన ఆష్విట్జ్‌ బిర్కెనౌ డెత్‌ విముక్తికి జనవరి 27 శుక్రవారంతో 78 ఏళ్లు. అందుకు గుర్తుగా ఆఫ్విట్జ్‌ మ్యూజియం రష్యన్‌ ప్రతినిధులను స్వాగతించాల్సి ఉండగా, ఉక్రెయిన్‌​ దాడి కారణంగా ఆహ్వనించ లేకపోయింది. 

(చదవండి: ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement