ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి.. ఇంట్లోకి దూసుకొచ్చిన క్షిపణి? | Videos of the Iran attack near Israel Dimona are going viral on social media | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి.. ఇంట్లోకి దూసుకొచ్చిన క్షిపణి?

Mar 22 2026 2:07 PM | Updated on Mar 22 2026 3:47 PM

Videos of the Iran attack near Israel Dimona are going viral on social media

జెరూసలేం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. తాజాగా,ఇరాన్‌ దక్షిణ ప్రాంతంలో నతాంజ్ అణు కేంద్రాన్ని లక్క్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్‌..ఇజ్రాయెల్‌లోని డిమోనా, అరద్ నగరాలపై క్షిపణులతో విరుచుకు పడింది.

ఇరాన్‌ జరిపిన క్షిపణ దాడుల్లో అనేక భవనాలు శిథిలయ్యాయి. క్షిపణుల దాడి సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో ఇరాన్‌ ప్రయోగించిన ఓ క్షిపణి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు,కిటికీల ఫ్రేములు ఎగిరిపోతుండగా..సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

ఏఎఫ్‌పీ ప్రకారం..ఇరాన్‌ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌ అరద్ పట్టణంలో 84 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా, డిమోనాలో 33 మంది గాయపడ్డారు. డిమోనాలో బాంబు షెల్‌ కారణంగా తీవ్రంగా గాయపడిన వారిలో పదేళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రానికి డిమోనా కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఈ దాడులకు ప్రాముఖ్యత ఏర్పడింది.

 


 

Advertisement
 
Advertisement
Advertisement