TikTok Hand Gestures: చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది...

US Teen Rescued From Kidnapper By TikTok Hand Gestures - Sakshi

కిడ్నాపర్‌ చెర నుంచి తప్పించుకునేందుకు బాలిక వినూత్న యత్నం

చేతి సైగతో తాను గృహహింస బాధితురాలినని.. సాయం కోరిన బాలిక

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ఓ మైనర్‌ బాలిక కొన్ని రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైంది. నిందితుడు బాలికను తనతో పాటు తీసుకెళ్తుండగా కారు ఓ చోట ట్రాఫిక్‌లో ఆగింది. అతడి చెర నుంచి బయటపడాలని భావించిన బాలిక తన చేతులతో పదే పదే ఒక సైగ చేయసాగింది.

ఆమె చేతి సైగను గమనించి, అర్థం చేసుకున్న కొందరు విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు మైనర్‌ని కాపాడి.. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. నోరు విప్పకుండా.. అరవకుండా.. కేవలం ఓ సైగ ద్వారా సదరు బాలిక తన జీవితాన్ని కాపాడుకుంది. ఆ వివరాలు..

నార్త్‌ కరోలినాకు చెందిన ఓ మైనర్‌ బాలిక కొన్ని రోజుల క్రితం తన బంధువు అయిన నిందితుడితో కలిసి బయటకు వెళ్లింది. నమ్మి వెంట వచ్చిన బాలికను కిడ్నాప్‌ చేశాడు నిందితుడి. బయటకు వెళ్లిన కుమార్తె రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. బాధితురాలి అసభ్య ఫోటోలతో ఆమెను బెదిరించసాగాడు కిడ్నాపర్‌. ఈ క్రమంలో ఓ రోజు నిందితుడు సదరు బాలికను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు.
(చదవండి: 18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు)

ఓ చోట కారు ట్రాఫిక్‌లో ఆగింది. అతడి చెర నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న బాలిక.. చుట్టూ ఉన్న వ్యక్తులకు తన పరిస్థితిని వివరించడం కోసం చేతితో ప్రత్యేక సైగ చేయసాగింది. బొటనవేలిని ముడిచి.. మిగతా వెళ్లను ఎత్తి.. ఆ తర్వాత వాటిని బొటన వేలు మీదుగా బిగించి చూపించే ఆ సైగకు తాను గృహహింస బాధితురాలినని.. సాయం చేయాల్సిందిగా అర్థం. ఈ సైగ టిక్‌టాక్‌లో చాలా ట్రెండ్‌ అవ్వడంతో ఆమె సైగలు గమనించిన కొందరు విషయాన్ని పోలీసులకు తెలిపారు.
(చదవండి: చిన్నారిని కిడ్నాప్‌ చేయించిన మేనమామ)

వారు నిందితుడి కారును వెంబండించి.. బాలికను కాపాడారు. నిందితుడి మొబైల్‌ని స్వాధీనం చేసుకుని చూడగా.. దానిలో బాలిక అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: కాబూల్‌లో భారతీయుని అపహరణ !

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top