F-15 జెట్‌ ధ్వంసం .. ఇరాన్ చేతిలో అమెరికా ఫైలట్‌? | US Fighter Pilot ejected fromaircraft in southwest iran | Sakshi
Sakshi News home page

F-15 జెట్‌ ధ్వంసం .. ఇరాన్ చేతిలో అమెరికా ఫైలట్‌?

Apr 3 2026 11:26 PM | Updated on Apr 4 2026 9:06 AM

US Fighter Pilot ejected fromaircraft in southwest iran

పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక  F-15E యుద్ధ విమానాన్ని ఇరాన్‌ కూల్చి వేసింది. దీంతో దీనికి చెందిన ఇద్దరు ఫైలట్లు ఇరాన్‌ భూభాగంలో దూకారు. వారిలో ఒకరి  క్షేమ సమాచారం ఇప్పుడు ఇరు దేశాల  మధ్య ఆందోళనకరంగా మారింది.

నైరుతి ఇరాన్ ప్రాంతంలో  (IRGC) జరిపిన దాడిలో అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం దెబ్బతింది. దీంతో విమానం కూలిపోయే ముందే ఈ జెట్‌లో ఉండే ఇద్దరు సిబ్బంది పారాచూట్ ద్వారా ఇరాన్ భూభాగంలో దూకారు. దీంతో వీరి క్షేమ సమచారం ఇప్పుడు ఇరు దేశాల మధ్య హాట్‌టాఫిక్‌గా మారింది. వీరిలో ఒకరిని అమెరికా రక్షించి తరలించిందని కథనాలు పేర్కొన్నాయి. కాగా మరోకరి క్షేమంపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

అమెరికా వాదన 
ఈ ఇద్దరిలో ఒకరిని అమెరికా ప్రత్యేక దళాలు విజయవంతంగా రక్షించి, ఇరాన్ భూభాగం నుండి తరలించాయి.రెండో వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నాయని వెస్ట్రన్‌ మీడియా పేర్కొంది. మరోకరి కోసం తీవ్ర గాలింపులు జరుగుతన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితి వివరాలు  అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సైతం తెలిపినట్లు వైట్‌హౌస్‌ కథనాలు పేర్కొన్నాయి.

ఇరాన్‌ వాదన 
అయితే జెట్‌ కూల్చివేతతో ఇరాన్‌లో దూకిన సిబ్బంది ఒకరు ఇరాన్‌ అదుపులో ఉన్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరికొన్ని కథనాల ప్రకారం ఆ దేశ ప్రజలకు ఆ ఫైలట్‌ను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని ఆయనను పట్టుకున్న వారికి మంచి బహుమతులు ఇస్తామని ప్రకటించినట్లు తెలిపింది.

కాగా ఇప్పుడు ఆ అమెరికన్ ఫైలట్‌ అంశం ఇరు దేశాల మధ్య ఛాలెంజ్‌గా మారింది. అతన్ని క్షేమంగా పట్టుకుంటామని అమెరికా ప్రకటిస్తుండగా టెహ్రాన్‌ సైతం అతని కోసం తీవ్రంగానే గాలింపులు చేపడుతుంది ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement