అమెరికా సంచలన ప్రకటన..ఇరాన్ షరతులకు నో... | us denies Iranian claim of agreeing to unfreeze assets | Sakshi
Sakshi News home page

అమెరికా సంచలన ప్రకటన..ఇరాన్ షరతులకు నో...

Apr 11 2026 4:36 PM | Updated on Apr 11 2026 5:04 PM

  us denies Iranian claim of agreeing to unfreeze assets

ఇస్లామాబాద్‌లో అ‍మెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతకర పరిణామం చోటు చేసుకుంది. చర్చలకు ముందు అమెరికా రెండు కండీషన్స్‌ అంగీకరించిందని ఇరాన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా దీనిపై వైట్‌హౌస్‌ స్పందించింది. టెహ్రాన్‌ పెట్టిన షరతులను అంగీకరించలేదని సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రాయిటర్స్‌ కథనం ప్రచురించింది.

అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు సంబంధించి ఫ్రీజ్‌ చేసిన ఆస్తులను విడుదల చేయడం పై ఇరాన్ చేసిన ప్రకటన అబద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి టెన్షన్ నెలకొంది. కాగా అంతకుముందు ఇరాన్‌ కీలక ప్రకటన చేసింది. లెబనాన్‌ సీజ్‌ఫైర్‌, ఖతార్ ఇతర విదేశీ బ్యాంకులలో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని ప్రకటన విడుదల చేసింది. కాగా తాజాగా అమెరికా ఈ ప్రకటనను ఖండించింది.

అయితే ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో ఇరాన్‌- అమెరికాల మధ్య చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్‌ ప్రధాని ఇరు దేశాలతో వ్యక్తిగతంగా చర్చలు జరిపిన అనంతరం రెండు దేశాల ప్రతినిధులు నేరుగా చర్చల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రకటన ఆందోళన రేపుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement