ఇరాన్ దాడులకు చెక్.. యూఏఈ సరికొత్త వ్యూహాం | Is UAE Building Anti-Drone Shield Around Oil Facilities Amid Iran Attacks? | Sakshi
Sakshi News home page

ఇరాన్ దాడులకు చెక్.. యూఏఈ సరికొత్త వ్యూహాం

May 22 2026 11:23 PM | Updated on May 22 2026 11:23 PM

Is UAE Building Anti-Drone Shield Around Oil Facilities Amid Iran Attacks?

ఇరాన్ వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో తమ చమురు నిల్వ కేంద్రాలను రక్షించుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త రక్షణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. యూఈఏ ప్రభుత్వం చమురు నిల్వ కేంద్రాల చుట్టూ డ్రోన్ నిరోధక రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరలవుతున్నాయి. భారీ డ్రోన్లు దాడి చేసినా, అవి నేరుగా చమురు ట్యాంకులను తాకకుండా అడ్డుకోవడమే ఈ 'యాంటీ-డ్రోన్' వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో నడుస్తున్న యుద్దం వాతావారణంలో ఇరాన్‌.. వ్యూహాత్మకంగా యూఏఈను టార్గెట్‌ చేస్తూ తమ హెచ్చరికల తీవ్రతను పెంచింది. 

చమురు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, చివరికి ఒక అణు రియాక్టర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలలో మరోసారి దాడి చేస్తామని టెహ్రాన్‌ హెచ్చరిస్తోంది.  ఈ క్రమంలోనే తమ చమురు నిల్వ కేంద్రాలను కాపాడుకునేందుకు యూఏఈ పటిష్ట చర్యలను మొదలు పెట్టింది.

మరోవైపు తమపై నిఘా పెట్టేందుకు, ఉమ్మడి వ్యూహాలు రచించేందుకు యూఏఈ తన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా, ఇశ్రాయేల్ రక్షణ సంస్థలతో పంచుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  ఇజ్రాయెల్‌తో కలిసి ఒక భారీ నిధిని ఏర్పాటు చేస్తున్నాయి.

ఈ రెండు దేశాలు కలిసి అత్యాధునిక యాంటీ-డ్రోన్ ఆయుధాలను తయారు చేయనున్నట్లు సమాచారం. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యూఏఈని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగినట్లు తెస్తోంది.
చదవండి: స్టార్ ప్లేయ‌ర్ దూరం.. కేకేఆర్‌కు ఎదురుదెబ్బ‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement