స్టార్ ప్లేయ‌ర్ దూరం.. కేకేఆర్‌కు ఎదురుదెబ్బ‌! | KKR Angkrish Raghuvanshi Ruled Out Of Crucial IPL 2026 Due To Finger Injury Ahead Of Playoff Decider | Sakshi
Sakshi News home page

స్టార్ ప్లేయ‌ర్ దూరం.. కేకేఆర్‌కు ఎదురుదెబ్బ‌!

May 22 2026 9:17 PM | Updated on May 23 2026 9:37 AM

KKR Angkrish Raghuvanshi ruled out of IPL 2026 Finger Injury

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగ్‌క్రిష్ రఘువంశీ దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా చేతి వేలికి ఫ్రాక్చర్ అయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేకేఆర్ ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్‌కు దూరమైనట్లు కేకేఆర్ యాజమాన్యం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

కేకేఆర్ ఈ సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ఢీలా పడింది. అయితే రెండో అంచె మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కిన కేకేఆర్ ఇప్పుడు ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే కేకేఆర్ కంటే మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా, రాజస్తాన్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 

అయితే పంజాబ్‌, రాజస్తాన్‌లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయి, కేకేఆర్ తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అంగ్‌క్రిష్ రఘువంశీ దూరమవ్వడం పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ తన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్‌ల్లో 146 స్ట్రైక్‌రేట్‌తో 422 పరుగులు సాధించాడు. 

అయితే కేకేఆర్ జట్టులో రఘువంశీ కంటే నాణ్యమైన క్రికెటర్లు చాలా మందే ఉన్నప్పటికీ వారెవరూ ప్రభావం చూపలేకపోయారు. కానీ అంగ్‌క్రిష్ రఘువంశీ ప్రతీ మ్యాచ్‌లో స్థిరంగా రాణించి ఇవాళ కేకేఆర్‌ ప్లేఆఫ్ రేసులో నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement