400 కేజీల యురేనియం ఎత్తుకొచ్చేయండి?! : ట్రంప్‌ | Trump weighs operation to seize 450 kg of uranium from Iran | Sakshi
Sakshi News home page

400 కేజీల యురేనియం ఎత్తుకొచ్చేయండి?! : ట్రంప్‌

Mar 30 2026 2:14 PM | Updated on Mar 30 2026 2:18 PM

Trump weighs operation to seize 450 kg of uranium from Iran

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే, ట్రంప్‌ నిప్పుతో చెలగాటం ఆడినట్లే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్‌ అణు కార్యక్రమాలు చేపట్టకూడదని ఆయన పలు మార్లు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా ఆయన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారు. 

తాజా సమాచారం ప్రకారం, ఇరాన్‌లోని 450 కిలోలకుపైగా యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక చర్యను పరిశీలిస్తున్నారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించి అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్‌ను నిర్వహించాల్సి ఉంటుంది.

ట్రంప్‌ ప్రభుత్వం ఉన్నత స్థాయి చర్చల్లో, ఇరాన్‌లో ఉన్న 453.5 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా సైనిక దళాలను పంపే యోచనలో ఉందని తెలుస్తోంది. ఈ నిర్ణయం తీసుకుంటే, అమెరికా సైనికులు ఇరాన్‌లో కొన్ని రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండాల్సి రావచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement