
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్‌లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని, అక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశంలో చర్చలు జరిపే అవకాశాలున్నాయిని, ట్రంప్ పరిపాలనా యంత్రాంగం తెలిపింది.
🚨#BREAKING | US President Donald Trump is planning a visit to South Korea for the APEC summit in October, with a potential high-stakes meeting with China's Xi Jinping being discussed.
Details Here: https://t.co/6mmh7wwhNa#DonaldTrump #SouthKorea #XiJinping #China— The Headliner (@TheHeadliner_in) September 7, 2025
అక్టోబర్ చివరి నుండి నవంబర్ ప్రారంభం వరకూ జియోంగ్జు నగరంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ తో పాటు ఆయన అగ్ర సలహాదారులు కూడా హాజరుకానున్నారు. గత నెలలో ఈ ఇద్దరు అధినేతల మధ్య ఫోనులో సంభాషణ జరిగింది. ఈ నేపధ్యంలో ట్రంప్, అతని భార్య మెలానియాలను జిన్‌పింగ్ చైనా సందర్శనకు ఆహ్వానించారు. అయితే ఈ పర్యటన అక్టోబర్‌లో జరగనున్నప్పటికీ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఈ విదేశీ పర్యటనను ముగించే ముందు ఇతర దేశాలు వెళతారా లేదా అనేది కూడా ఇంకా వెల్లడికాలేదు.
ట్రంప్ తన విదేశీ పర్యటన సందర్భంగా అమెరికాకు మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని యోచిస్తున్నారు. ట్రంప్ ఇటీవల సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో సహా పలు దేశాలలో పర్యటించినప్పుడు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.మరోవైపు జిన్‌పింగ్ ఇటీవల కిమ్, వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీలకు ఆతిథ్యం ఇచ్చారు. దీనిని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.