అమెరికా-ఇరాన్‌ చర్చల వేళ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు | Trump Says Mandatory For Muslim Nations Involved In Iran Deal To Join Abraham Accords, More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికా-ఇరాన్‌ చర్చల వేళ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

May 25 2026 9:28 PM | Updated on May 26 2026 1:29 PM

Trump says mandatory for Muslim nations involved in Iran deal to join Abraham Accords

వాషింగ్టన్‌: దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు..కానీ ఈ ఒప్పందం కుదరకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది’అని ఆయన హెచ్చరించారు.

2026 మే 22న దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మరింత ముందుకు సాగేందుకు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి.

ట్రంప్ గత శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.

ఈ చర్చల్లో ట్రంప్, అబ్రహాం ఒప్పందాలపై అన్ని దేశాలు ఒకేసారి సంతకం చేయాలని సూచించారు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ సభ్యులుగా ఉన్నాయని, మిగతా దేశాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు దేశాలు సంతకం చేయకపోయినా అది అంగీకారయోగ్యమే కానీ ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement