నాటో తీరుపై ట్రంప్ మళ్లీ విమర్శలు | Trump Reacts NATO About Hormuz Strait | Sakshi
Sakshi News home page

Trump: ఒత్తిడి పెట్టకపోతే సమస్యలు అర్థం కావు

Apr 9 2026 11:11 PM | Updated on Apr 10 2026 9:48 AM

Trump Reacts NATO About Hormuz Strait

నాటో వ్యహరిస్తున్న తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మనల్ని నిరాశపరిచే నాటో కూటమితో పాటు మిత్ర దేశాలకు, ఒత్తిడి పెట్టకపోతే సమస్యలేవి అర్థం కావు అని అన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ పెట్టారు. ఇరాన్‌తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్‌ని దక్కించుకునే విషయంలో నాటో కలిసి రానందుకు ఇప్పటికే నాటో దేశాలని ఇప్పటికే ట్రంప్ విమర్శిస్తున్నారు.

మరోవైపు మంగళవారం రాత్రికే ఇరాన్ నాగరికతని అంతం చేస్తానని హెచ్చరికలు ఇచ్చిన ట్రంప్.. సరిగ్గా గంటన్నర ముందు కాల్పుల విరమణ ప్రకటించారు. రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పాక్ మధ్యవర్తిత్వం చేయగా.. ఇప్పుడు ఆ దేశంలోని ఇస్లామాబాద్‌లోనే అమెరికా-ఇరాన్ చర్చలకు సిద్ధమయ్యాయి. 

భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి ఇరు దేశాల ప్రతినిధులు.. ఇస్లామాబాద్ చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం పాక్ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. చర్చల కోసం వచ్చే బృందాలకు పూర్తి సహకారం అందిస్తామని పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే సీజ్ ఫైర్ కొనసాగుతుండగానే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement