హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసేందుకు యూకే ప్రభుత్వం అమెరికాకు అనుమతిచ్చింది. ఇరాన్‌పై దాడులకు తమ సైనిక స్థావరాలను వినియోగించుకోవచ్చని యూకే ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటన విడుదల చేశారు.
ఇరాన్‌పై యుద్దంలో యూకే మద్దతు తెలిపినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. యూకే తమ సాయాన్ని ప్రకటించడంతో ఆలస్యం చేసిందని పెదవి విరిచారు. తమకు మిత్ర రాజ్యమైన యూకే ఈ ప్రకటనను చాలా ముందే చేసుండాల్సిందని అన్నారు.
యూకే అమెరికాకు మద్దతివ్వడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రంగా స్పందించారు. అమెరికాకు మద్దతిచ్చి స్టార్మర్ బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని అన్నారు.
బ్రిటిష్ ప్రజల్లోని చాలా మంది, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనాలని కోరుకోవడం లేదని తెలిపారు. అమెరికా ఎంతమంది మద్దతు కూడగట్టుకున్నా, ఇరాన్ తన స్వీయరక్షణ హక్కును వినియోగిస్తుందని స్పష్టం చేశారు.
యూకే తాజా నిర్ణయంతో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పటికే ఉక్రెయిన్ కూడా అమెరికాకు మద్దతు తెలిపింది. శత్రువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇరాన్ ఇంకెనాళ్లు యుద్దం కొనసాగించగలదో చూడాలి.


