ట్రంప్‌ రిటైర్మెంట్‌: కూతురు ఎంగేజ్‌మెంట్‌ | Tiffany Trump Gets Engaged Before Father Leaves Office | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ రిటైర్మెంట్‌: కూతురు ఎంగేజ్‌మెంట్‌

Jan 20 2021 2:57 PM | Updated on Jan 20 2021 4:23 PM

 Tiffany Trump Gets Engaged Before Father Leaves Office - Sakshi

వాషింగ్టన్‌: ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెబుతున్న సమయంలో ఆయన చిన్నకుమార్తె టిఫనీ ట్రంప్ (27) ఎంగేజ్‌మెంట్‌ సంబరాల్లో మునిగి తేలారు.  తండ్రి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీవిరమణకు ఒక రోజు ముందు వైట్ హౌస్‌లో మంగళవారం ప్రియుడు మైఖేల్ బౌలోస్‌తో నిశ్చితార్థం వేడుకను పూర్తి చేసుకున్నారు.  ఈ విషయాన్ని  స్వయంగా  టిఫనీ  ఇన్‌స్టాలో ప్రకటించారు. 

"కుటుంబ సభ్యులతో కలిసి వైట్‌హౌస్‌లో కీలక మైలురాళ్లు, చారిత్రాత్మక సందర్భాలను జరుపుకోవడం, అనేక జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం సంతోషంగా ఉంది. కాబోయే భర్త మైఖేల్‌తో  నిశ్చితార్థం జరుపుకోవడం ప్రత్యేక సందర్భం, అదృష్టం ఇంకేదీ లేదు. రానున్న అద్భుత క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నా అంటూ ఇన్‌స్టాలో తెలిపారు. టిఫనీ పోస్ట్‌కు స్పందించిన ఆమె ప్రియుడు బౌలోస్ కూడా అదే ఫోటోను షేర్‌ చేస్తూ "లవ్ యు హనీ" అని వ్యాఖ్యానించాడు. దుబాయ్ నుంచిప్రత్యేకంగా తెప్పించిన 13 క్యారెట్లఎమరాల్డ్ కట్ డైమండ్‌ రింగుతో టిఫనీకి తన ప్రేమను ప్రతిపాదించాడట బౌలోస్.  దీని విలువ 1.2 మిలియన్ డాలర్లుంటుందని అంచనా. 

ట్రంప్‌ రెండవ భార్య మార్లా మాపుల్స్  ఏకైక సంతానం  టిఫనీ ట్రంప్ జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుంచి  న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా లండన్ వ్యాపారవేత్త బౌలోస్ (23)లెబనాన్‌లో జన్మించాడు. హుళ బిలియన్ డాలర్ల నైజీరియా సంస్థ వారసుడైన బౌలోస్‌ లండన్‌ కాలేజీలో చదువుకున్నాడు. ఈ జంటను మొదటిసారిగా 2018 జనవరిలో కెమెరా కంటికి చిక్కడంతో వీరి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. లండన్‌లోని ఒక ఖరీదైన ఆభరణాల దుకాణం వద్ద ఈ జంట ఎంగేజ్‌మెంట్ రింగులను కొనుగోలు చేసినట్టు  వార్తలు ఇటీవల హల్‌చల్‌ చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement