Sri Lanka Presidential Elections: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల వేళ.. భారత్‌ సాయం కోరిన విపక్షనేత

Sri Lanka Presidential Elections: Opposition Leaders Appeal To India - Sakshi

కొలం‍బో: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నేడు పార్లమెంట్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శ్రీలంక ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ నాయకుడు సాజిత్‌ ప్రేమదాస సోషల్‌ మీడియా వేదికగా భారత్‌కి ఒక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో... "ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్‌లోని అన్ని రాజకీయ పార్టీలకు నా హృదయ పూర్వక అభ్యర్థన.  అధ్యక్షుడిగా ఎవరూ  ఎన్నికైనా భారత్‌ లంక తల్లికి మద్దతిచ్చి సహాయం చేస్తు ఉండాలని కోరారు." నెలల తరబడి సాగిన నిరసనకారులు ఆందోళనల నడుమ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స గతవారమే రాజీనామా చేశారు.

రాజపక్స కుటుంబికులే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నారని వారివల్లే ఆర్థిక సంక్షోభానికి దారితీసిందంటూ వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో గోటబయ లంక విడిచిపెట్టి పోవాల్సి రావడమే కాకుండా పదవికి రాజీనామ చేయాల్సిన దుస్థితి ఎదురైంది. ఆయన వెళ్లిపోతూ.. లంక అధ్యక్ష బాధ్యతలు విక్రమ సింఘే రణిల్‌కి అప్పగించారు. దీంతో విక్రమసింఘే లంక తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

కానీ విక్రమసింఘేను రాజపక్స మిత్రపక్షంగా చూసే నిరసనకారులు ఆయన ప‍ట్ల విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఐతే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని రణీల్‌ విక్రమ సింఘే, విద్యాశాఖ మాజీ మంత్రి డల్లాస్‌ అలహప్పెరుమా, వామపక్ష జనతా విముక్తి పెరమున పార్టీ నేత అనురా దిస్సనాయకేలు పోటీ పడుతున్నట్లు పార్లమెంట్‌ ప్రకటించింది.

ఐతే ఈ త్రిముఖ పోటీలో రణిల్‌ విక్రమసింఘేకే గెలిచే అవకాశాలు ఎక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పెరమున నుండి విడిపోయిన గ్రూప్‌కు చెందిన కీలక నేత డల్లాస్‌ అలహప్పెరును అధ్యక్ష ఎన్నికకు పోటీ చేస్తుండటంతో సాజిత్‌ ప్రేమదాస ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్‌లో బుధవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షుడు 2024 నవంబరు వరకు పదవిలో కొనసాగనున్నారు. 

(చదవండి: Sri Lanka Presidential Election: శ్రీలంక అధ్యక్ష బరిలో ముగ్గురు.. విక్రమ సింఘేకే అవకాశం!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top