పదవీచ్యుత దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్యకు అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష | South Korea court sentences Ex-First Lady Kim Keon Hee to 4 years in jail | Sakshi
Sakshi News home page

పదవీచ్యుత దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్యకు అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష

May 1 2026 2:41 AM | Updated on May 1 2026 2:41 AM

South Korea court sentences Ex-First Lady Kim Keon Hee to 4 years in jail

సియోల్‌: దక్షిణ కొరియా పదవీచ్యుత అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ భార్య కిమ్‌ కియోన్‌ హీకి అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. తిరుగుబాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న యూన్‌కు కోర్టు జీవిత కాల జైలు శిక్ష విధించింది. 

యూనిఫికేషన్‌ చర్చికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రతిగా ఖరీదైన బహుమతులను అందుకున్నట్లు రుజువు కావడంతో ఓ కోర్టు కిమ్‌ కియోన్‌ హీకి 20 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. స్టాక్‌ మార్కెట్‌ను ప్రభావితం చేసిన మరో కేసు నుంచి ఆమె బయటపడ్డారు. అయితే ఈ రెండు తీర్పులపై ఇరుపక్షాలు హైకోర్టులో అప్పీల్‌ చేసుకున్నాయి. విచారించిన కోర్టు.. కిమ్‌ కియోన్‌ హీ శిక్షను నాలుగేళ్లకు పెంచుతూ తీర్పు వెలువరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement