ఆకాశమంత దట్టమైన పోగ...కెమికల్‌ ప్లాంట్‌ భారీ పేలుడు...ఒకరు మృతి

Shanghai Chemical Plant Fire One Dead - Sakshi

Chemical Plant Explosion: చైనా రాజధాని షాంఘైలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిన్షాన్ జిల్లాలో సినోపెక్ షాంఘైలో పెట్రోకెమికల్ ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

దీంతో ఆకాశమంత ఎత్తులో మంటలు వ్యాపించి.... దట్టమైన పొగతో కమ్మేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ బ్యూరో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసలే గత కొంత కాలంగా కరోనా కారణంగా వరుస లాక్‌డౌన్‌తో ఈ ప్లాంట్‌ని మూసేశారు. చాలా రోజుల తర్వాత ఈ ప్లాంట్‌ని తిరిగి ప్రారంభించినప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు .

అయితే స్థానికుల మాత్రం భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, పైగా ఆరు కిలోమీటర్లు దూరంలోని నివాసితుల కూడా వినిపించిందని చెప్పారన్నారు. ఆ పేలుడు ధాటికి సమీపంలో అపార్ట్‌మెంట్‌లో తలుపులు సైతం కదిలిపోయాయని అధికారులు తెలిపారు. షాంఘై పట్టణం మంతా దట్టమైన పోగతో నిండిపోయిందని, ప్రమాదాలను నియంత్రించే మానిటరింగ్‌ డేటా.. గాలి నాణ్యతను సాధారణ స్థితికి తీసుకువచ్చిందని చెప్పారు. అంతేకాదు ఘటనా స్థలంలో 500 మందికి పైగా రెస్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు.

(చదవండి: బ్లాక్‌ లిస్ట్‌ నుంచి పాక్‌ బయటపడనుందా?)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top