breaking news
chemical plant explosion
-
బతికి వస్తేనే మాకు బతుకు
అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిలి్చన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి: కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.క్యాంపులో బిక్కుమంటూ..బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేవుడా కనికరించు దేవుడా ఒక్కసారి కనికరించు... నా భర్తను క్షేమంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపు. గత జూలై 16న ధర్మరాజ్‌తో వివాహం జరిగింది. ఎనిమిది నెలల క్రితం నేను ఆయనతో కలిసి వచ్చి గృహిణీగా ఉంటున్నాను. సంవత్సరం తిరగక ముందే దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. సిగాచి పేలుడులో నా భర్త గాయాలపాలయ్యాడు. ఐజీయూలో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్న. – కశ్మీరా కుమారీ, బీహర్ నా భర్త రాజేష్ కుమార్ చౌదరీ సిగాచిలో లేబర్‌గా పని చేస్తున్నాడు. పొట్టచేత పట్టుకొని నగరానికి వలస వచ్చాం. అనుకోని ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడటంతో ఎమి చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశాం.ఆయన జీతంతోనే కుటుంబం గడుస్తోంది. ఐసీయూలో ఉన్న ఆయన బతికి తిరిగి వస్తేనే మాకు బతుకు ఉంటుంది. – సనాపతి, బీహర్ కళ్ల ముందే కకావికలం సోమవారం ఉదయం 9.30 తరువాత సిగాచిలో పేలుడు సంభవించింది. స్టోర్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా ఉన్న నేను కంపెనీ భవనం బయట ఉన్నాను. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డాను అంతలోనే పెద్ధ ఎత్తున మంటలు, దట్ట మైన పొగ భవన శిథిలాలు ఎగిరి వచ్చి తగలడంతో శరీరానికి గాయాలయ్యాయి.ప్రమాదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. మూడు రోజులుగా చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. –యశ్వంత్, విజయవాడ -
కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు...ఒకరు మృతి
Chemical Plant Explosion: చైనా రాజధాని షాంఘైలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిన్షాన్ జిల్లాలో సినోపెక్ షాంఘైలో పెట్రోకెమికల్ ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఆకాశమంత ఎత్తులో మంటలు వ్యాపించి.... దట్టమైన పొగతో కమ్మేసింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ బ్యూరో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసలే గత కొంత కాలంగా కరోనా కారణంగా వరుస లాక్‌డౌన్‌తో ఈ ప్లాంట్‌ని మూసేశారు. చాలా రోజుల తర్వాత ఈ ప్లాంట్‌ని తిరిగి ప్రారంభించినప్పుడే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు . అయితే స్థానికుల మాత్రం భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని, పైగా ఆరు కిలోమీటర్లు దూరంలోని నివాసితుల కూడా వినిపించిందని చెప్పారన్నారు. ఆ పేలుడు ధాటికి సమీపంలో అపార్ట్మెంట్లో తలుపులు సైతం కదిలిపోయాయని అధికారులు తెలిపారు. షాంఘై పట్టణం మంతా దట్టమైన పోగతో నిండిపోయిందని, ప్రమాదాలను నియంత్రించే మానిటరింగ్ డేటా.. గాలి నాణ్యతను సాధారణ స్థితికి తీసుకువచ్చిందని చెప్పారు. అంతేకాదు ఘటనా స్థలంలో 500 మందికి పైగా రెస్యూ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారని అధికారులు వెల్లడించారు. (చదవండి: బ్లాక్ లిస్ట్ నుంచి పాక్ బయటపడనుందా?) -
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
బీజింగ్: చైనాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. షాన్‌డోంగ్ ప్రావిన్సులో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. లిన్గాంగ్ ఎకనమిక్ జోన్‌లోని ఓ రసాయన కర్మాగారంలో ఆదివారం రాత్రి పనులు జరుగుతున్న సమయంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. పేలుడుతో మంటలు అంటుకుని 8 మంది కార్మికులు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న ఆయిల్ ట్యాంకర్లకు అంటుకున్నాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అక్కడున్న కార్మికులతో పాటు చుటుపక్కల వారిని వెంటనే ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. దాదాపు 900 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి సోమవారం మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.