కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు! | Sakshi
Sakshi News home page

కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు!

Published Thu, Aug 10 2023 7:17 AM

several women duped through customs scam - Sakshi

ఫేక్ ఐడెంటిటీల సాయంతో ఆన్‌లైన్‌లో పలువురు మహిళలను మోసం చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మహిళలే స్వయంగా ఇటువంటి మోసాలకు దిగడం విశేషం. వారు ఫేక్‌ ఐడెంటిటీల సాయంతో కొంతమంది మహిళలకు ఫోన్‌ చేసి.. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని, వాటిని తీసుకునేందుకు కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాలని చెబుతూ, వారి నుంచి డబ్బులు వసూలు  చేస్తున్నారు.  

ఆ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో ఇదేకోవకు చెందిన ఒక ఉదంతంలో పోలీసులు 36 ఏళ్ల నైజీరియన్‌ను అరెస్టు చేశారు. అరెస్టయిన మహిళ పలువురు మహిళలకు ఫోన్ చేసి, మీకు వచ్చిన ఖరీదైన బహుమతులు అందుకోవాలంటే వెంటనే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టయిన మహిళను పోలీసులు నైజీరియాకు చెందిన ఒఫోరిగా గుర్తించారు. 

ఆమె వలలో పడి 20 మంది బాధితులు మోసపోయినట్ల పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎనిమిది బ్యాంకు ఖాతాల ద్వారా ఈ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తనను తాను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఒక మహిళ ఆన్‌లైన్‌లో తనతో స్నేహం చేసిందని పేర్కొంటూ, ఆ తరువాత జరిగిన సంఘటనల గురించి ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలోనే ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఆ మహిళతో కొద్దికాలంలోనే మంచి ‍స్నేహం ఏ‍ర్పడిందని, అప్పటి నుంచి ఆమె బహుమతులు పంపేదని తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ నుండి కాల్ వచ్చిందని తెలిపారు. తన పేరు మీద విమానాశ్రయానికి కొన్ని బహుమతులు వచ్చాయని, వాటిని విడుదల చేయాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి తనకు తెలిపారని పేర్కొన్నారు. దీంతో తాను రూ. 25 వేలు చెల్లించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను చెల్లించినదానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్‌ చేయడంతో తనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 

ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశారు. మోసానికి పాల్పడిన ఆ మహిళ సోషల్ మీడియా ఖాతాల కోసం ఉపయోగించిన ఐడిలు నైజీరియాకు చెందినవని తేలింది. బాధితురాలి కాల్‌ రికార్డింగ్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా నైజీరియన్‌ మహిళ ఓఫోరి ఈ మోసానికి కీలక సూత్రధారి అని తేలింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
ఇది కూడా చదవండి: తల్లీకొడుకుల ‍ప్రాణం తీసిన మొబైల్‌ చార్జర్‌

Advertisement
 
Advertisement