
భారత్‌పై నోరుపారేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ తమను ఏమాత్రం రెచ్చగొట్టినా నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. బెదిరింపులతో తమను లొంగదీసుకోలేరని వ్యాఖ్యానించారు. తమను రెచ్చగొడితే వెంటనే తగిన బుద్ధి చెప్తామని వెల్లడించారు.
నేటి అణ్వాయుధాల వాతావరణంలో యుద్ధాలకు తావులేదని, ఈ విషయంలో భారత సైనికాధికారులు తెలుసుకోవాలని సూచించారు. శనివారం పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం భారత్‌తో జరిగిన సైనిక ఘర్షణలో అద్భుతమైన సామర్థ్యాలు ప్రద ర్శించామని, లక్ష్యాలను ఛేదించామని అన్నారు.
కేవలం అంకెల్లో గొప్పగా కనిపిస్తున్న ప్రత్యరి్థపై విజయం సాధించామని స్పష్టంచేశారు. భారత్‌ను అస్థిరపర్చడానికి భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుటోందని అసిమ్ మునీర్ ఆరోపించారు. పిడికెడు మంది ఉగ్రవాదులు తమను ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్నవారిని మట్టిలో కలిపేస్తామని పరోక్షంగా తెహ్రీక్–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ని హెచ్చరించారు.