ఇజ్రాయెల్‌ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్‌ | Netanyahu Will Do Whatever I Want: Donald Trump | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్‌

May 21 2026 2:35 AM | Updated on May 21 2026 2:35 AM

Netanyahu Will Do Whatever I Want: Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌లో త‌న‌కు త‌న‌కు విశేష‌ ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవ‌కాశ‌ముంద‌ని వెల్ల‌డించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయ‌న‌ వ్యాఖ్యానించారు

నెతన్యాహు చాలా మంచి వ్య‌క్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు స‌రైన గౌర‌వం ద‌క్క‌డం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది.  నేను అక్క‌డ ప్ర‌ధాన‌మంత్రిగా పోటీ చేసినా గెల‌వ‌గ‌ల‌ను" అని ట్రంప్ విలేక‌రుల స‌మావేశంలో పేర్కొన్నారు. 

ప్ర‌స్తుతం ట్రంప్ వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చనీయాంశ‌మ‌య్యాయి. కాగా ఇరాన్‌తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. త‌నకు ఎలాంటి తొంద‌ర లేద‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement