మోడెర్నా వ్యాక్సిన్ : 10 కోట్ల డోసులకు డీల్

Moderna US in Covid-19 vaccine deal for 100 million doses - Sakshi

1.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం 

వాషింగ్టన్ : కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అమెరికా మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న అమెరికా కంపెనీ మోడెర్నాతో ఈ ఒప్పందాన్నిచేసుకుంది. 100 మిలియన్ మోతాదుల కోవిడ్ -19 ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను తయారు చేసి పంపిణీ చేసేలా డీల్ కుదుర్చుకుంది.  

మోడెర్నా వ్యాక్సిన్ 100 మిలియన్ల మోతాదుల తయారు, పంపిణీకి ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించారు. 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరిందని, టీకాకు అనుమతి లభించిన వెంటనే 100 మిలియన్ మోతాదులను వేగంగా ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు.  (వ్యాక్సిన్ : ఇన్ఫీ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు)

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంలో భాగంగా తాజాగా మరో డీల్ సాధించడం విశేషం. వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందున్న అమెరికన్‌ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ‘ఎంఆర్‌ఎన్‌ఏ1273’ పేరుతో తీసుకొస్తున్న తమ వ్యాక్సిన్ చివరి  దశ పరీక్షలను సెప్టెంబరులో పూర్తి చేయబోతున్నామని ఇటీవల ప్రకటించిన సంగతి తె లిసిందే.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top