కన్న తల్లికే షాక్‌.. ఒకే కాన్పులో 9 మంది సంతానం

Malian Woman Gives Birth To Nine Babies Two More Than Doctors - Sakshi

మాలి: సాధారణంగా ఒకే కాన్పులో కవలలో , లేక ముగ్గురికి జన్మనిస్తేనే వింత అనుకుంటాం. అలాంటిది ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. దీంతో ఇది మామూలు వింత కాదు వింతలకే వింత అంటున్నారు చూసిన వారంతా. ఈ ఘటన మాలిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మాలికి చెందిన హలీమా సిస్సి (25) మంగళవారం 9 మందికి సంతానానికి ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఆమెకు డెలివరీ చెయడానికి ఇద్దరు డాక్టర్లకు పైనే శ్రమించాల్సి వచ్చింది. ఇలా ఒకే డెలివరీలో తొమ్మిది మంది పుట్టడంతో ఈ వార్త ఆ దేశ నాయకుల వరకు వెళ్లింది.  ’పుట్టిన 9 మంది సంతానంలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అ‍బ్బాయిలు ఉన్నారు.

తల్లి, తొమ్మిది పిల్లలు క్షేమంగానే ఉన్నారిని..  ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సీబీ తెలిపారు. స్కానింగ్‌ సమయంలో ఎక్కువ మందికి సంతానం కలిగి ఉన్నానని డాక్టర్లు చెప్పారు. వారి అంచనా ప్రకారం బహుశా ఉంటే ఏడుగురు సంతానం ఉండొచ్చని ఆ మహిళ భావించిందట. కానీ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చేసరికి ఆమెకే ఆశ్చర్యంగా ఉందని హలీమా తెలిపింది. ఈ డెలివరీ ప్రక్రియ మొత్తం సిజేరియన్‌ ద్వారానే చేసినట్లు డాక్టర్లు తెలిపారు.  

( చదవండి: గర్భవతని తెలియదు.. విమానంలో గాల్లో ఉండగానే డెలివరీ )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top