యునైటెడ్ కింగ్‌డమ్: లండన్‌కు వెళ్తున్న రైలులో చోటుచేసుకున్న సామూహిక కత్తిపోటు దాడులు యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రి షబానా మహమూద్ ధృవీకరించారు.
ఈ రైలు.. డాన్‌కాస్టర్ నుండి లండన్‌లోని రద్దీగా ఉండే కింగ్స్ క్రాస్ స్టేషన్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. అలారం మోగిన వెంటనే, కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హంటింగ్‌డన్ రైల్వే స్టేషన్‌ను సాయుధ పోలీసులు, పోలీసు కార్లు అంబులెన్స్‌లు చుట్టుముట్టాయి. దీంతో రైలు అక్కడే నిలిచిపోయింది. బ్రిటిష్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు (బీటీపీ) ‘ఎక్స్’లో ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఉగ్రవాద నిరోధక విభాగాలు దర్యాప్తు ప్రారంభించాయని తెలిపారు.
రైలులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటన గురించి వివరించారు. ఒక పొడవైన కత్తిని పట్టుకున్న వ్యక్తిని చూసినట్లు ఒకరు ‘టైమ్స్’ వార్తాపత్రికకు తెలిపారు. ఆ సమయంలో అంతటా రక్తం కనిపించిందని, ప్రయాణికులు భయంతో వాష్‌రూమ్‌లలో దాక్కున్నారని తెలిపారు. మరొకరు ‘స్కై న్యూస్’తో మాట్లాడుతూ, రైలు ఆగిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై ఒక వ్యక్తి పెద్ద కత్తిని పట్టుకుని ఉన్నాడని, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూశామని చెప్పారు.
BREAKING: Major incident unfolding as up to 10 people stabbed on a train in Huntington, Cambridgeshire. pic.twitter.com/KYC7aN68QQ
— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) November 1, 2025
ఆందోళనకరం: ప్రధాని కీర్ స్టార్మర్
యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ ఘటనను భయంకరమైనది.. ఆందోళనకరమైనదిగా పేర్కొన్నారు. బాధితుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని, అయితే వెంటనే ప్రతిస్పందించిన అత్యవసర సేవా విభాగాలకు ధన్యవాదాలు అని ఆయన ‘ఎక్స్’లో ఒక తెలిపారు. కాగా ఈ ఘటన మరోసారి యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెరుగుతున్న కత్తి దాడుల ప్రమాదాలను ఎత్తిచూపింది. అధికారిక డేటా ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్‌లో 2011 నుండి తరహా దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధాని కీర్ స్టార్మర్ గతంలో ఇటువంటి దాడులను జాతీయ సంక్షోభంగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: ‘బాహుబలి’ నేత అరెస్ట్.. మోకామాలో కలకలకం


