
లండన్: క్వీన్ ఎలిజబెత్–2 అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు (రూ.1,655 కోట్లు) ఖర్చయినట్లు బ్రిటన్ కోశాగార విభాగం (ట్రెజరీ) వెల్లడించింది. రాణి అంత్యక్రియల ఖర్చులను ట్రెజరీ చీఫ్ సెక్రెటరీ జాన్ గ్లెన్ పార్లమెంట్‌కు సమరి్పంచారు. 70 ఏళ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో కొనసాగిన ఎలిజబెత్–2 గత ఏడాది సెపె్టంబర్ 8న మరణించిన సంగతి తెలిసిందే. గత సెపె్టంబర్ 19న జరిగిన ఆమె అంత్యక్రియలకు వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు