నేపాల్‌ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం | Key decision by the Nepal Government | Sakshi
Sakshi News home page

నేపాల్‌ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం

Mar 30 2026 3:00 AM | Updated on Mar 30 2026 3:14 AM

Key decision by the Nepal Government

నేపాల్‌లో ఇటీవల ఎన్నికైన  నూతన ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఇక నుంచి ఆ దేశంలో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేదించనున్నట్లు ప్రకటించింది. అక్కడి రాజకీయ నాయకుల ఆస్తులపై విచారణ జరపనున్నట్లు ప్రకటించింది.

నేపాల్‌లో ఇటీవల  బాలేంద్ర షా ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రభుత్వం అక్కడ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. తమ ప్రభుత్వ 100 రోజుల కార్యాచరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థి రాజకీయాలను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు 60 రోజుల్లోపు తమ కార్యాలయాలను విద్యా సంస్థల నుండి తొలగించాలని తెలిపింది. వాటి  స్థానంలో కేవలం విద్యార్థుల సమస్యల కోసం మాత్రమే పనిచేసే "స్టూడెంట్ కౌన్సిల్" లేదా "వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్" వంటి రాజకీయ రహిత వేదికలను 90 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని తెలిపింది.

అదేవిధంగా  5వ తరగతి వరకు సంప్రదాయ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆదేశంలో విదేశీ పేర్లతో ఉన్న పాఠశాలలు, కళాశాలలకు ఆక్స్‌ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్లతో ఉన్న పాఠశాలలు, కళాశాలలు ఈ ఏడాది లోపు తమ పేర్లను నేపాలీ పేర్లుగా మార్చుకోవాలని  ఆదేశించింది. ఇది దేశీయ అస్తిత్వాన్ని కాపాడేందుకు తీసుకున్న చర్య అని ప్రభుత్వం తెలిపింది.

2006 తర్వాత కీలక పదవుల్లో ఉన్న నాయకులు, అధికారుల ఆస్తులపై విచారణ జరిపేందుకు 15 రోజుల్లో ఒక శక్తివంతమైన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.కాగా  గత ఏడాది జరిగిన 'జెన్ జీ' (Gen-Z) ఉద్యమం సమయంలో జరిగిన హింసకు బాధ్యుడిగా చేస్తూ మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలీని ఇటీవలే అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement