Sakshi News home page

Japan Earthquake Deaths: 73కు చేరిన ‘జపాన్‌’ మరణాల సంఖ్య

Published Thu, Jan 4 2024 4:45 AM

Japan quake toll rises to 73 as weather hampers rescuers - Sakshi

సుజు: నూతన సంవత్సరం రోజునే భారీ భూకంపం బారిన పడిన జపాన్‌లో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.6 తీవ్రతతో వచి్చన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 73కు పెరిగింది.

భారీ వర్షాలు, చంపేసే చలి కారణంగా సహాయక చర్యలకు ఆటంక ఏర్పడుతోందని, అయినాసరే సహాయక చర్యల్ని ముమ్మురం చేసినట్లు ప్రధాని ఫుమియో కిషిదా బుధవారం చెప్పారు. సగం కూలిన భవనాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉన్నారని సహాయక సిబ్బంది అంచనావేశారు. రాత్రంతా కేవలం నాలుగు డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉండటంతో చలిలో శిథిలాల వద్ద అన్వేషణ, గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడిన 300 మందిని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 33,000 మందిని సహాయక శిబిరాలకు తరలించారు.

Advertisement

What’s your opinion

Advertisement