Restrictions Against Pandemic: ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..!

Israel Govt Decided To Ban Entry Of Foreign Nationals Into The Country - Sakshi

జెరూసలేం: కోవిడ్‌ మహమ్మారి ఉధృతి పెరుగుతున్న కారణంగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం విదేశీయుల రాకపై తాజాగా ఆంక్షలను విధించింది. అర్ధరాత్రి కాబినెట్‌ సమావేశం తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం నుంచి మొత్తం14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని,  ఫోన్-ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్‌లో ఉ‍న్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఐతే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఓమిక్రాన్ కారణంగా 50 ఆఫ్రికన్ దేశాలను ఇప్పటికే రెడ్‌ లేబుల్‌ కింద గుర్తించబడ్డాయి. ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాలకు ఇజ్రాయెల్‌ ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించడం జరిగింది. ఆఫ్రికా ఖండం నుండి వచ్చే ఇజ్రాయెలీయులను కూడా క్యారంటైన్‌లో ఉండాలని తెల్పింది. దీంతో మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్‌ మీడియాకు తెలిపారు.

కాగా ఇప్పటికే కొత్తవేరియంట్‌ తాలూకు కేసులు యూకే, యూరోపియన్ దేశాలలో వెలుగుచూసిన సంగతి తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉధృతిని అరికట్టడానికి అనేక దేశాలు అంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు అదేబాటను ఇజ్రాయెల్‌ దేశం కూడా అనుసరిస్తోంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top