ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి

Published Sat, Dec 30 2023 5:58 PM

Israel Destroy Hamas Tunnel Complex 200 People No More In 24 Hours - Sakshi

గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకరమైన దాడులు చేస్తోంది. ఖాన్‌ యూనిస్‌ పట్టణంలోని దక్షిణ భాగంలో తమ దాడుల తీవ్రతను పెంచడానికి ఇజ్రయెల్‌ సేనలు సిద్ధమవుతున్నాయ. ఇజ్రాయెల్‌ సైన్యం యుద్ధ ట్యాంక్‌లతో విరుచుకుపడుతోంది. వైమానిక బాంబు దాడులకు పాల్పడుతోంది. హమాస్‌ మిలిటెంట్లు లక్ష్యంగా  జరుగుతున్న ఇజ్రాయెల్‌ దాడులల్లో శుక్రవారం రాత్రి వరకు సుమారు 24 గంటల్లో 200 మంది పాలస్తీనియన్లు​ మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌ సేనలు హమాస్‌ కమాండ్‌ సెంటర్ల, ఆయుధ డిపోల వద్దకు చేరుకున్నాయని ఇజ్రాయెల్‌​ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ తెలిపారు. గాజా సిటీలో ఉన్న హమాస్‌ అగ్రనేత యాహ్యా సిన్వార్ ఇంటి లోపల ఉన్న ఓ సొరంగాన్ని ధ్వంసం చేశామని తెలిపారు.

సెంట్రల్ గాజా స్ట్రిప్‌లో ఉన్న నుసిరత్ క్యాంప్‌ సమీపంలోని ఓ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడిలో స్థానిక అల్-ఖుద్స్ టీవీ పనిచేస్తున్న పాలస్తీనా జర్నలిస్టు, అతని కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన హమాస్‌ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతిచెందగా.. 240 మంది వారి చేతిలో బంధీలు ఉన్నారు. గాజాలో పూర్తిగా హమాస్‌ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు తీవ్రత పెంచుతోంది.

చదవండి: గుండె తరుక్కుపోయే చిత్రం.. ఇలాంటి ఒక్క చిరునవ్వు చాలు!

Advertisement
Advertisement