ఇటీవల ఇస్లామాబాద్‌లో ఇరాన్-పాక్ మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలెవల్ డెలిగేషన్ మీటింగ్ అత్యంత పటిష్టమైన భద్రత మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మరాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు జరిగి వెళ్లే సమయంలో తమ విమానంపై అటాక్ జరుగుతోందని తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.
అమెరికా- ఇరాన్ మధ్య రేపు( గురువారం) రెండో సారి శాంతి చర్చలు జరగనున్నాయి. ఇస్లామాబాద్‌లో మెుదటగా జరిగిన చర్చలలో ఎటువంటి సానూకూల ఫలితాలు రాకపోవడంతో మరో దఫా చర్చలకు రెండే దేశాలు సమాయాత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ మారాండీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ముగించి తిరుగు ప్రయాణంలో వారి విమానానికి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు.
ప్రొఫెసర్ మారాండీ మాట్లాడుతూ " పాక్‌లో చర్చలు ముగించుకొని వెళుతున్న సమయంలో ఫ్లైట్‌లో అబ్బాస్ అరాఘ్చీ, స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్‌తో ఇతర కీలక నేతలు ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా మా విమానం క్షిపణి దాడికి గురువుతుందని బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని ప్రత్యామ్నయ మార్గం ద్వారా తరలించాం. వాస్తవానికి టెహ్రాన్‌లో దిగాల్సి ఉండగా అత్యవసరంగా ఇరాన్ నగరం మషద్ నగరంలో ఫ్లైట్ ల్యాండ్ చేసి కార్లు, ట్రైన్ల ద్వారా టెహ్రాన్ నగరం చేరుకున్నాం".అని అన్నారు.
అమెరికా జిత్తులమారని తమకు తెలుసని అందుకే ఆ దేశాన్ని ఎప్పుడు నమ్మదలుచుకోలేదని ప్రొఫెసర్ అన్నారు. మాతో చర్చలు జరుపుతూనే మరోవైపు తమ మిలటరీ బేస్‌లను మరింత బలపరుచుకుంటుందన్నారు. అయితే చర్చల సమయంలో పాకిస్థాన్ ఇరాన్‌కు అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఆదేశానికి చెందిన అత్యాధునికి విమానాలు ఇరాన్ ప్రతినిధుల బృందం ఉన్న విమానానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రొఫెసర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


