హర్మూజ్‌ విషయంలో ఇరాన్‌ భింకం ఇందుకే? | Iran is not reopening the Strait of Hormuz, here's the reason | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌ విషయంలో ఇరాన్‌ భింకం ఇందుకే?

Apr 11 2026 11:36 AM | Updated on Apr 11 2026 11:53 AM

Iran is not reopening the Strait of Hormuz, here's the reason

ప్రస్తుతం ఇరాన్‌, అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరితే యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకూ జరిగిన యుద్ధంలో హాట్‌ టాఫిక్‌గా నిలిచిన అంశాలలో ప్రధానమైంది హర్మూజ్‌ జలసంధి. దీనిని తెరవాలని అమెరికా పట్టుబట్టడం ఇరాన్‌ ససేమిరా అనడంతో చాలా కాలం పాటు ఉద్రిక్తతలు నడిచాయి. అయితే ఇరాన్ ఈ జలసంధిని తెరవలేక పోవడానికి అందులో అమర్చిన మైన్స్‌ సైతం ఓ కారణంగా తెలుస్తోంది.

ప్రపంచ రవాణాకు హర్మూజ్ జలసంధి ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వాణిజ్య రవాణాలో దాదాపు 20 శాతంకు పైగా దీనిగుండానే ప్రయాణం అవుతాయి. గల్ఫ్‌ దేశాలకు చెందిన చమురుతో పాటు ఇతరత్రా కీలకమైన వస్తువులు దీని గుండానే సరఫరా జరుగుతుంది. అయితే యుద్ధం కారణంతో ఇరాన్‌ను దీనిని మూసివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా నిలిచి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సంక్షోభ పరిస్థిలకు ట్రంప్ యుద్ధ నిర్ణయమే కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే హర్మూజ్ తెరవాలని ట్రంప్ పలుమార్లు హెచ్చరించినా ఇరాన్‌ మాత్రం ససేమిరా అంది. ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరినా వెనక్కి తగ్గలేదు. ఇరాన్‌ ఇంత మెుండిగా వ్యవహరించడానికి ఇతర కారణాలు ఉన్నాయని విశ్లేశకులు భావిస్తున్నారు.

అయితే తొలి నుంచి అమెరికా, ఇజ్రాయెల్‌ తో యుద్ధం తలెత్తి అవకాశం ఉందని భావించిన ఇరాన్‌ హర్మూజ్‌ని మూసివేయాలని భావించినట్లు తెలుస్తోంది. దీనికోసమే ఆ జలసంధికి చెందిన చాలా ప్రదేశాల్లో ల్యాండ్‌ మైన్స్‌ (మందుపాతరలు) పెట్టింది. అయితే అలల తాకిడికి చాలా మైన్స్‌ కొట్టుకపోయి ఉండవచ్చని అవి ఎక్కడ ఉన్నాయో ప్రస్తుతం ఇరాన్‌కు సైతం గుర్తించ లేకుండా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పూర్తి సురక్షిత ప్రయాణానికి జలసంధిని తెరవాలని అల్టిమేటం ఇవ్వడం.. ఒక వేళ అనుమతి ఇచ్చాక ఏదైనా ప్రమాదంతో షిప్‌లు పేలిపోతే యుద్దం తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఇరాన్‌ కొంత ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.

దానితో పాటు ల్యాండ్‌ మైన్లను అమర్చడం కంటే తొలగించడం మరింత కష్టమని ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో వాటిని తొలగించే సాంకేతికత గానీ సమయం గానీ ఇరాన్‌ వద్ద లేవని పేర్కొన్నాయి. ఒకవేళ ట్రంప్ మాటలను నమ్మి వాటిని తొలగిస్తే ఆయన ప్లేటు పిరాయిస్తే పరిస్థితులు ఏంటని అక్కడి నాయకులు ఆలోచిస్తున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే హర్మూజ్‌ తెరవడానికి సందిగ్ధిత కొనసాగుతుందని తెలిపాయి. 

అయితే  ట్రంప్ ఈ జలసంధి అంశంపై తాజాగా ‍స్పందించారు ఇరాన్‌ హర్మూజ్‌ను తెరిచినా.. తెరవకపోయినా త్వరలోనే దానిని మేము ఓపెన్‌ చేస్తాము అని అన్నారు. ఈ విషయంలో వేరే దేశాలు సైతం మాకు సహాయం చేస్తామని ప్రకటించాయి అని అన్నారు. అయితే వాటి పేర్లు మాత్రం వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement