యుద్ద నష్టం ఇన్ని లక్షల కోట్లా..? ఇరాన్‌ సంచలన ప్రకటన | Iran announces details of US war losses | Sakshi
Sakshi News home page

యుద్ద నష్టం ఇన్ని లక్షల కోట్లా..? ఇరాన్‌ సంచలన ప్రకటన

Apr 14 2026 2:15 PM | Updated on Apr 14 2026 2:28 PM

Iran announces details of US war losses

పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు కలిసి ఇరాన్‌ మౌళిక సదుపాయాలతో పాటు ఆర్మీ బేస్‌, విద్యుత్‌ ప్లాంట్లపై క్షిపణులు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఇరాన్‌ ప్రభుత్వం యుద్ధం వల్ల ఇప్పటి వరకూ జరిగిన నష్టంపై  ప్రాథమిక అంచనా విడుదల చేసింది. టెహ్రాన్‌పై జరిపిన దాడులలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 25 లక్షల కోట్లు నష్టం ఇరాన్‌కు వాటిల్లిందని తెలిపింది. ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని ఈ సంఖ్య మరింతగా పరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇంత పెద్ద మెుత్తంలో తమ దేశ ఆస్తిని ధ్వంసం చేసిన వారినే పరోక్షంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలని పరిహారం చెల్లించాల్సిందిగా కోరుతామని తెలిపింది.

అయితే ఇరాన్ తొలుత నుంచి అమెరికాను పరిహారం చెల్లించాల్సిందిగా కోరింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల్లోనూ యుద్ద నష్టపరిహరం తన డిమాండ్లలో ఉంచింది. ఇంత పెద్దమెుత్తంలో ఆస్తి నష్టం జరగడంతో ఒక వేళ పరిహారం చెల్లించకపోతే ఇరాన్ ఆర్థికంగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. అయితే దీనిపై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement