కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్‌.. భార్య మృతి | Indian Woman Dies In UAE After Husband Accidentally Hits Her With Car | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదం: భర్త డ్రైవింగ్‌.. భార్య మృతి

Jan 18 2021 8:09 PM | Updated on Jan 18 2021 9:11 PM

Indian Woman Dies In UAE After Husband Accidentally Hits Her With Car - Sakshi

దుబాయ్: ఓ వ్యక్తి కారు పార్కింగ్‌ చేస్తున్న క్రమంలో అనుకోకుండా వాహనం భార్య మీదకు దూసుకెళ్లడంతో మహిళ మరణించింది. ఈ ఘటన దుబాయ్‌లో చోటుచేసుకోగా స్థానిక మీడియా సోమవారం ప్రచురించింది. వివరాలు.. లిజీ తన భర్తతో కలిసి శనివారం హెల్త్‌ చెకప్‌ కోసం తమ కమ్యూనిటీలోని ఆసుపత్రికి వెళ్లారు. యూఏఈలోని అజ్మాన్ ఎమిరేట్‌లోని ఆసుపత్రి వద్దకు వచ్చాక లిజీ కారు ఎదుట నిల్చోని వాహనాన్ని పార్కింగ్‌ చేస్తున్న తన భర్తకు డైరెక్షన్స్‌ చెబుతోంది. ఈ క్రమంలో అనుకోకుండా కారు వేగంగా ముందుకు దూసుకు రావడంతో లిజీని ఢికొని సరిహద్దు గోడకు తాకింది. చదవండి: దారుణం: ఏడేళ్లుగా అత్యాచారం.. కూతురికి గర్భం

ఈ ప్రమాదంలో మహిళకు గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. కాగా లీజీ, తన భర్త ఇద్దరూ కేరళకు చెందిన వారు. పదేళ్ల క్రితమే ఈ జంట దుబాయ్‌లోలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇండియాలో ఇంజనీరింగ్‌ చేస్తుండగా కూతురు దుబాయ్‌లో చదువుతోంది. కాగా ఈ విషయం తెలియగానే యూఏఈలోని ఇండియన్‌ కమ్యూనిటీ షాక్‌కు గురైనట్లు ఇండియన్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నిట్టికా తెలిపారు. ఈ ఘటనపై అజ్మాన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి ఇండియన్‌ అసోసియేషన్‌ కుటుంబానికి సహకరిస్తోందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement