మనీలాండరింగ్‌ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి | Indian origin county judge in US convicted of money laundering, sentencing on June 16 | Sakshi
Sakshi News home page

మనీలాండరింగ్‌ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి

Mar 21 2026 10:56 PM | Updated on Mar 21 2026 10:56 PM

Indian origin county judge in US convicted of money laundering, sentencing on June 16

భారతీయ మూలాలున్న ఓ కౌంటీ జడ్జి అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కేపీ జార్జ్ ప్రచార నిధులను వ్యక్తిగత ఖర్చులకు వాడినట్లు జ్యూరీ నిర్ధారించింది. దీంతో ఆయనపై మూడో స్థాయి ఫెలనీ కేసు నమోదైంది. 

టెక్సాస్ చట్టం ప్రకారం ఈ నేరానికి రెండు నుండి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.  

ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. జార్జ్ తన ప్రచార ఖాతా నుండి 46,000 డాలర్లకు పైగా మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి గృహ సంబంధిత చెల్లింపులు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. 

ఆయన తరఫు న్యాయవాదులు ఈ మొత్తాన్ని ప్రచారానికి ఇచ్చిన వ్యక్తిగత రుణాల రీయింబర్స్‌మెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, జ్యూరీ గంటల తరబడి జరిపిన విచారణ అనంతరం ఆయనను దోషిగా తేల్చింది. శిక్షను జూన్‌ 16న ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.

తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు జార్జ్‌ను కోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అమెరికా చట్టాల పరంగా, జార్జ్‌ దోషిగా తేలిన వెంటనే పదవి నుంచి తొలగింపుకు అర్హుడు. అయితే అధికారికంగా శిక్ష విధించే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement