ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి | India Stands With Iran: PM Modi Condoles President Ebrahim Raisi Death | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ అధ్యక్షుడు రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

May 20 2024 12:17 PM | Updated on May 20 2024 12:35 PM

India Stands With Iran: PM Modi Condoles President Ebrahim Raisi Death

ఇరాన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో భారత్‌ ఇరాన్‌కు అండగా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో సంతాపం ప్రకటించారు.

‘ఇరాన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సయ్యద్‌ ఇబ్రహీం రైసీ మరణవార్త విని దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత్‌-ఇరాన్‌ దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. అతని కుటుంబ సభ్యులకు, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్‌కు అండగా నిలుస్తోంది’ అని పేర్కొన్నారు.

 ‘ఈ మరణవార్త షాక్‌కు గురిచేసింది. ఇరాన్‌ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రితో పలుమార్లు సమావేశమయ్యాను. ఈ జనవరిలో మా మధ్య భేటీ జరిగింది. ఈ విషాద సమయంలో ఇరాన్‌ ప్రజలకు అండగా ఉంటాం.
-భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌

 కాగా ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్‌ను బెల్‌-212 ఆదివారం సాయంత్రం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్‌ఏ ధ్రువీకరించింది.

రైసీతోపాటు విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీరబ్దొల్లహియాన్ (60), తూర్పు అజర్‌బైజాన్‌ ప్రావిన్సు గవర్నర్ మలేక్‌ రహ్‌మతీ తదితరులు కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్- అజర్‌బైజా ప్రావిన్స్‌ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యామ్ ప్రారంభోత్సంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో  ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. విమానం బయలుదేరిన దాదాపు 30 నిమిషాలకే అడవుల్లో కుప్పకూలింది.

మరోవైపు ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నేపథ్యంలో ఇరాన్‌ అధ్యక్షుడి మరణవార్త పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్‌ దాడి నేపథ్యంలో ఇరాన్‌ హమాస్‌కు మద్దతుగా ఉంది. గత నెలలో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లతో  విరుచుపడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement