వార్‌ వన్‌ సైడ్‌.. పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌! 

India Anupama Singh Highlighted Irony In Pakistan Stance At UNHRC - Sakshi

జెనీవా: దాయాది దేశం పాకిస్థాన్‌కు మరోసారి భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టాలనే పాక్‌ ప్లాన్‌ను భారత్‌ చాకచక్యంగా తిప్పి కొట్టింది. దీంతో, పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. జమ్మూకశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌కు భారత్‌ గట్టిగా బుద్ధిచెప్పింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది.

కాగా, జెనీవా వేదికగా ఐరాస మానవ హక్కుల మండలి 55వ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌, తుర్కియే లేవనెత్తాయి. భారత్‌లో మానవ హక్కుల అణచివేత జరుగుతోందని నోరుపారేసుకున్నాయి. దీంతో, వారి ఆరోపణలకు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది. ‘రైట్‌ టు రిప్లై’ అవకాశం కింద ఈ మండలికి భారత కార్యదర్శి అనుపమ సింగ్‌.. పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘ఉగ్ర దాడులతో పారిన రక్తంతో వారి చేతులు తడిసిపోయాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు వారికి లేదు. భారత్‌పై అసత్య ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాకిస్థాన్‌ ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఆ దేశం తమ ప్రసంగంలో జమ్మూకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించింది. వారికి మేం చెప్పేది ఒక్కటే.. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ మా దేశ అంతర్భాగాలే. మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఆ దేశానికి ఎలాంటి హక్కు లేదు అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో తుర్కియేపైనా భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. పాక్‌కు మద్దతిస్తూ తుర్కియే కూడా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం విచారకరం. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగకుండా.. అనుచిత వ్యాఖ్యలు చేయడం జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నా’మని అన్నారు. 

ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. మైనార్టీలకు దారుణంగా కాల్చివేశారు. వందలమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారు మానవహక్కుల గురించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వారు ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో పాక్‌ తడిసిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. సొంత ప్రజల కష్టాలు తీర్చలేక ఆ ప్రభుత్వం విఫలమైంది. అలాంటి దేశం చేసే అసత్య ఆరోపణలపై మేం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కౌంటరిచ్చారు. 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top