‘నోరె’ళ్లబెట్టే రికార్డు! 4 మెక్‌డొనాల్డ్స్‌ చీస్‌ బర్గర్లను అవలీలగా..

Guinness World Record: Boy With The Biggest Mouth 4014 Inch Mouth Gape - Sakshi

అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో ఐశాక్‌ జాన్సన్‌ అనే టీనేజర్‌ మరోసారి తన టాలెంట్‌తో అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు. నోటిని అత్యంత పెద్దగా తెరవడంలో తన పేరిటే ఉన్న గిన్నిస్‌ రికార్డును బద్దలు కొట్టాడు. తన నోటిని ఏకంగా 4.014 అంగుళాల (10.196 సెంటీమీటర్లు) మేర తెరిచి పురుషుల్లో అత్యధిక వెడల్పుతో నోరు బార్లా తెరిచిన వ్యక్తిగా నిలిచాడు.

తన నోటి వెడల్పు సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకు 4 మెక్‌డొనాల్డ్స్‌ చీస్‌ బర్గర్లను అవలీలగా నోట్లో పెట్టేసుకున్నాడు. అలాగే ఓ కోకాకోలా టిన్‌ను, పొడవాటి ప్రింగిల్స్‌ చిప్స్‌ టిన్‌ను నోట్లో పెట్టుకొని చూపించాడు. వాస్తవానికి 2019లో 3.67 అంగుళాల మేర నోటిని తెరిచి ఐశాక్‌ తొలుత గిన్నిస్‌ రికార్డు సృష్టించాడు. అయితే అమెరికాకే చెందిన ఫిలిప్‌ ఆంగస్‌ అనే యవకుడు 3.75 అంగుళాల మేర నోటిని తెరిచి ఐశాక్‌ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

దీంతో ఐశాక్‌ 2020లో జరిగిన పోటీలో తన నోటిని 4 అంగుళాల మేర తెరిచి మళ్లీ కొత్త రికార్డు నెలకొల్పాడు. తాజాగా మూడోసారి మరో రికార్డు సృష్టించాడు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నోరు తనకు ఉండటం.. మూడుసార్లు తాను గిన్నిస్‌ రికార్డు నెలకొల్పడం వింతగా అనిపిస్తోందని ఐశాక్‌ పేర్కొన్నాడు.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top