నువ్వంటే ప్రాణం.. నేను అంతరిక్షంలో ఉన్నా.. రూ.25లక్షలు పంపితే రాకెట్‌లో వచ్చి పెళ్లి చేసుకుంటా!

Fake Astronaut Cheated Japan Woman Rs24 Lakh - Sakshi

టోక్యో: ప్రేమ పేరుతో జపాన్ మహిళను మోసం చేశాడు ఓ వ్యక్తి. తాను రష్యా వ్యోమగామినని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌సీ)లో పని చేస్తున్నాని చెప్పి నమ్మించి బురిడీ కొట్టించాడు. మహిళను తాను ప్రాణంగా ప్రేమిస్తున్నాని చెప్పాడు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీని ఖర్చుల కోసం ఆమె వద్ద నుంచి 4.4 మిలియన్ యెన్‌(రూ.25లక్షలు) వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా పదే పదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది.

ఈ జపాన్ మహిళ వయసు 65 ఏళ్లు. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఐఎస్‌సీలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. జూన్‌లో ఇందుకు సంబంధించి ఫోటోలు పెట్టాడు. ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చాడు. ఇవి చూసి అతడు నిజంగా వ్యోమగామి అని మహిళ నమ్మింది. ఇద్దరూ తరచూ చాట్ చేసుకున్నారు. 
 
ఆ తర్వాత వీరి సంభాషణ ఇన్‌స్టాగ్రాం నుంచి జపాన్ సోషల్ మీడియా యాప్‌ 'లైన్‌'కు మారింది. ఇందులోనే మహిళను ప్రాణంగా ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉండాలని ఉందని చెప్పాడు. దీంతో ఆమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి భూమ్మీదకు రావాలంటే ఖర్చవుతుందని రూ.25లక్షలు పంపాలని మహిళను అతను కోరాడు. 

అతడ్ని నమ్మిన ఆమె రూ.25లక్షలు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్‌ 5 మధ్య ఐదు విడతల్లో పంపింది. అయినా అతను ఇంకా డబ్బు కావాలని అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతను వ్యోమగామి కాదని, మోసం చేశాడని తెలిసింది. పోలీసులు ఈ కేసును 'ఇంటర్నేషనల్‌ రోమాన్స్ స్కామ్‌'గా ట్రీట్ చేసి విచారణ చేపట్టారు.
చదవండి: Viral Video: నడిరోడ్డుపై దిండు వేసుకుని పడుకుని హల్‌చల్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top