ఉక్రెయిన్‌: గడ్డకట్టే చలిలో భారతీయుల నిస్సహాయత.. వీడియో ఇదిగో

Embassy Says Indian Students Waiting In Freezing Cold In Kyiv - Sakshi

ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం కైవ్‌లో ఉండటానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం తాజా సలహాను జారీ చేసింది. "సమీపంలోని బాంబు షెల్టర్‌ల జాబితాను పంచుకుంటూ,..వాటిలో చాలా భూగర్భ మెట్రోలలో ఉన్నాయని, సమీపంలోని బాంబు షెల్టర్‌లను గుర్తించడానికి గూగుల్ మ్యాప్‌లను కూడా సంప్రదించమని రాయబార కార్యాలయం విద్యార్థులను కోరింది.  అంతేకాదు దయచేసి మీ పరిసరాల గురించి తెలుసుకుని సురక్షితంగా ఉండండి. అవసరమైతే తప్ప మీ ఇళ్లను విడిచిపెట్టవద్దు.  ఉక్రెయిన్ యుద్ధ చట్టాలు గురించి మీకు తెలుసు అందువల్ల మీ పత్రాలను ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి అని రాయబార కార్యాలయం సూచించింది.

కైవ్‌లో బస చేయడానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షిత ప్రాంతంలో ఉంచడానికి మిషన్ సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని,  రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాయబార కార్యాలయం వెలుపలికి వచ్చారని, అయితే వారందరికీ ఎంబసీ ప్రాంగణంలో వసతి కల్పించలేదని  పేర్కొంది. అయితే వారి కోసం సమీపంలోని సురక్షిత ప్రాంగణాలను ఏర్పాటు చేసినట్లు ఎంబసీ వెల్లడించింది. కైవ్‌లోని గ్రౌండ్ పరిస్థితిని బట్టి ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టిందని కూడా తెలిపింది.

అంతేకాదు ఉక్రెయిన్‌లోని విద్యార్థులతో సహా భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం కొనసాగిస్తోంది అని రాయబార కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రియాంక చతుర్వేది, మనీష్ తివారీతో సహా పలువురు రాజకీయ నాయకులు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ..ఎంబీసీ వద్ద ఉన్న విద్యార్థులకు కనీసం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులను అభ్యర్థిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి.

మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ అంశంపై ప్రభుత్వ ప్రణాళికను విమర్శించారు. సమయం ఉన్నప్పుడే ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్లాన్ చేసి ఉండాల్సింది అన్నారు. ప్రతి క్లిష్ట పరిస్థితుల్లోనూ ముఖం తిప్పుకోవడం.. మౌనంగా ఉండడం మోడీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందంటూ చురకలు అంటించారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారత యువత భయం భయంగా ప్రాణాంతక పరిస్థితులతో పోరాడవలసి వస్తుందని అన్నారు. ఇదేనా మీ 'స్వయం-అధారిత' మిషన్" అని సుర్జేవాలా అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: నా కుమారుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నాడు, ఓ తండ్రి ఆవేదన)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top