అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్‌పై మస్క్‌ విమర్శలు | Elon Musk Slams Donald Trump Over Tax Bill, Calling It A Disgusting Abomination | Sakshi
Sakshi News home page

అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్‌పై మస్క్‌ విమర్శలు

Jun 4 2025 7:58 AM | Updated on Jun 5 2025 3:33 PM

Elon Musk Slams Donald Trump Over Big,beautiful Bill

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ప్రభుత్వంపై అపరకుబేరుడు, మాజీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ(డోజ్‌)చీఫ్‌, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మస్క్‌ (elon musk) షాకింగ్‌ కామెంట్లు చేశారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్‌ డాలర్లకు చేరుతుంది. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్‌ మస్క్‌కు డోజ్‌ నుంచి బయటకు వచ్చారు. అయితే, తొలిసారి ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించారు. ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్రంగా మండిపడ్డారు 

బిగ్‌,బ్యూటిఫుల్‌’ (Big Beautiful Bill) అంటూ ట్రంప్‌ (donald trump) చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్‌ ప్రభుత్వం దివాళా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఈ భారీ, దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. మీరు తప్పు చేశారని మీకు తెలుసు’ అని పేర్కొన్నారు. 

ట్రంప్‌ నిర్ణయం మారదు
అయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై మస్క్‌ నిర్ణయం ఏంటో ట్రంప్‌కు తెలుసు. అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారు’ చెప్పారు.

గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్‌ స్పందించారు. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్‌కు పెంచుతుంది. అమెరికన్‌  కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు  తీసుకుంటుందన్నారు. 

అమెరికా అధ్యక్షుడిపై ఈలాన్ మస్క్ మండిపాటు

ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచింది
మస్క్ ఈ బిల్లుపై డోజ్‌ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ)కు రాజీనామా అనంతరం సీబీఎస్‌ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతోంది. ఇది డోజ్‌ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండటం నాకు తెలియదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement