వైరల్‌: ‘పాపం కుల్ఫీలు అమ్ముతున్న ట్రంప్‌’

Donald Trump Doppelganger Selling Kulfi in Pakistan - Sakshi

నెట్టింట్లో వైరల్‌గా మారిన పాకిస్తాన్‌ వ్యక్తి వీడియో

ఇస్లామాబాద్‌: సాధారణంగా మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటున్నారు. సామాన్యులను పోలిన వారు కనిపిస్తే.. పెద్దగా పట్టించుకోం కానీ సెలబ్రిటీలను పోలిన వారు కనిపిస్తే.. అదో పెద్ద విశేషంగా భావిస్తాం. వారికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో చేసి షేర్‌ చేసి వైరల్‌ చేస్తాం. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెటిజనులను అబ్బురపరుస్తుంది. ఆ వివరాలు.. 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అగ్రరాజ్యధ్యక్షుడిగా కంటే కూడా ఆయన ట్రెపంరితనం వల్ల ఎక్కువ ప్రసిద్ధి చెందారు. ఇక ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో పెద్దగా కనిపించకుండా పోయారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా పాకిస్తాన్‌ వీధుల్లో కుల్ఫీలు అమ్ముతూ జనాల కంట పడ్డారు. ట్రంప్‌ ఏంటి.. కుల్ఫీలు అమ్మడం ఏంటి అనుకుని కాస్త పరిశీలనగా చూసి అవక్కయ్యారు జనాలు. ఎందుకంటే ఆ వ్యక్తి అచ్చు ట్రంప్‌లానే ఉన్నాడు. ఇంకేముంది అతగాడిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో తెగ వైరలవుతోంది. 

ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోని పాకిస్తానీ సింగర్, గేయ రచయిత షెహజాద్ రాయ్ అతని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'వా... కుల్ఫీ వాలా భాయ్... అద్భుతం..' అనే క్యాఫ్షన్‌తో వీడియోని షేర్‌ చేశారు. అంతేకాదు, ఎవరికైనా అతని గురించి తెలిస్తే తనకు చెప్పాలని కోరారు. షెహజాద్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలోని వ్యక్తి కుల్ఫీ అమ్ముతూ ఉర్ధూ పాటలు అద్భుతంగా పాడుతున్నాడు. రూపంతోనే కాక గాత్రంతో కూడా ఆకట్టుకుంటున్నాడు. 

ఇక ఈ వీడియోపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అతను మాకు తెలుసని... అతని వద్ద చాలాసార్లు కుల్ఫీ తిన్నామని కొంతమంది చెబుతుంటే... బహుశా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక... ట్రంప్ ఇలా పాకిస్తాన్ వీధుల్లో కుల్ఫీ అమ్ముకుంటున్నాడేమో.. అంటూ మరికొందరు సెటైర్లేస్తున్నారు. ఈ వీడియోలోని వ్యక్తి పంజాబ్‌లోని సహివల్ ప్రాంతానికి చెందినవారని... ఆయన చిరునామా తాము చెబుతామంటూ మరికొందరు సింగర్ షెహజాద్ రాయ్ ఇన్‌స్టాలో రిప్లై ఇచ్చారు.

చదవండి: చైనా వైరస్‌: ట్రంప్‌పై దావా.. ఒక్కొక్కరి మీద 1 డాలర్‌
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top