60 మిలియన్లకు కోవిడ్‌ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!

Covid-19 Cases In The United States Surpassed 60 Million  - Sakshi

అమెరికాలో కరోనా కేసులు సంఖ్య దాదాపు 60 మిలియన్లకి చేరుకుంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది మృతి చెందారని జాన్స్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం తన పరిశోధనలో పేర్కొంది.  ఈ కరోనా మహమ్మరితో అత్యధికంగా ప్రభావితమైన దేశంగా అమెరికా నిలిచింది. పైగా ప్రపంచపరంగా చూస్తే సుమారు 15 శాతానికి పైగా అత్యధిక మరణాలు యూఎస్‌లోనే సంభవించాయి. ఐతే గతేడాది నవంబర్‌ 29 కల్లా యూఎస్‌లో సుమారు 10 మిలయన్లకు పైగా కరోనా కేసులు నమోదైయ్యాయి.

(చదవండి: వరల్డ్‌ స్ట్రాంగెస్ట్‌ గర్ల్‌: దెబ్బ పడితే ఖతమే!)

అది కాస్త జనవరి 1, 2021 కల్లా 20 మిలియన్లు దాటింది. పైగా  ఆ సంఖ్య గతేడాది డిసెంబర్‌ 13 చివరి కల్లా 50 మిలియన్లకు చేరింది. అంతేకాదు అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్‌ 1, 2021న కోవిడ్‌ -19 ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌కి సంబంధించిన తొలి కేసు నమోదు అయ్యిందని మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌసీ స్థానిక మీడియాకి వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ ఇప్పటి వరకు చాలా దేశాల్లో పెను విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్ని  కఠినమైన కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నాయి.

(చదవండి: మోటర్‌బోట్లపై విరిగిపడ్డ కొండచరియలు.. చూస్తుండగానే ఏడుగురి ప్రాణాలు..)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top