పా​క్‌కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత?

china and pakistan navy to hold joint exercises in arabian sea - Sakshi

చైనా, పాకిస్తాన్ నౌకాదళాలు తొలిసారి సంయుక్త నావికా విన్యాసాన్ని నిర్వహించబోతున్నాయి. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ కసరత్తుపై పాక్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాగా పాకిస్తాన్ తన మిత్రదేశం చైనాను హాంగౌర్ క్లాస్‌ జలాంతర్గామి ​కావాలని కోరింది. ఈ రెండు దేశాలు దీనిని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాయి.

పాకిస్తాన్ తన ఆయుధ అవసరాలను తీర్చుకునేందుకు చైనాపైననే అధికంగా ఆధారపడుతోంది. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్- 2023 నివేదిక ప్రకారం 80వ దశకంలో ఆఫ్ఘన్ జిహాద్‌ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ అమెరికా నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేసేది. అయితే 2005 నుండి 2015 వరకు పాకిస్తాన్.. చైనా నుండి అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేసిందని ఆ నివేదిక వెల్లడించింది.

గత 15 ఏళ్లలో పాకిస్తాన్‌కు చైనా 8,469 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అందించింది. అంతకుముందు గత 50 ఏళ్లలో, చైనా.. పాకిస్తాన్‌కు 8794 మిలియన్ డాలర్ల (ఒక మిటియన్‌ అంటే రూ. 10 లక్షలు) విలువైన ఆయుధాలను అందించింది. ఇంతేకాకుండా పాకిస్తాన్ సైన్యం అమెరికా, రష్యా నుండి కూడా గరిష్ట సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంటుంది. 2015 నుండి పాకిస్తాన్ ఆయుధ అవసరాలలో 75 శాతం చైనా తీరుస్తుంది. 2021లో పాకిస్తాన్.. చైనా నుండి హై-టు-మీడియం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ మిసైల్‌ను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ ఆర్మీలో చైనా ఫిరంగి, రాకెట్ లాంచర్లను ఉపయోగిస్తున్నారు.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్‌తో కలసి నావికా విన్యాసాలు చేపట్టనున్న సందర్భంగా చైనా తన ఆరు నౌకలను అరేబియా సముద్రంలో దించనుంది. ఈ నౌకల్లో గైడెడ్ మిస్సైల్ జిబో, గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ జింగ్జౌ, లిని ఉన్నాయి. ఇది కాకుండా రెండు షిప్‌బోర్న్ హెలికాప్టర్లలో నావికాదళ సిబ్బంది విన్యానాల్లో పాల్గొననున్నారు. అలాగే చైనా టైప్-093 సాంగ్ కేటగిరీకి చెందిన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌ను కూడా మోహరించినుంది. పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ తెలిపిన వివరాల ప్రకారం సీ గార్డియన్- 2023 నావికా విన్యాసాల ఉద్దేశ్యం  ఇరు దేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం. 
ఇది కూడా చదవండి: కొత్త రూపంలో కోవిడ్‌-19.. భారత్‌కూ తప్పని ముప్పు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top