ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ ప్రాణం తీసిన నిందితుడు దొరికాడు | Charlie Kirk suspect into custody says trump | Sakshi
Sakshi News home page

Charlie Kirk: ట్రంప్‌ సన్నిహితుడి హత్య.. నిందితుడు దొరికాడు

Sep 12 2025 6:46 PM | Updated on Sep 12 2025 8:52 PM

Charlie Kirk suspect into custody says trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు, కన్జర్వేటివ్‌ పార్టీ యాక్టివిస్ట్‌ చార్లీ కిర్క్‌ (31) ప్రాణాలు తీసిన నిందితుడు దొరికాడు. నిందితుడికి చాలా దగ్గర వ్యక్తులే అతడిని పట్టించినట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫాక్స్‌ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

ట్రంప్‌కు సన్నిహితుడిగా, సంప్రదాయవాదిగా పేరుగాంచిన చార్లీ కిర్క్‌(31) దారుణ హత్యకు గురయ్యాడు. అమెరికాలో యూటా రాష్ట్రంలోని ఉటా వ్యాలీ స్టేట్‌ యూనివర్సిటీలో బుధవారం ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా 150 మీటర్ల దూరంలో ఓ భవనం పైభాగంలో మాటువేసిన గుర్తుతెలియని వ్యక్తి తుపాకీ గురిపెట్టాడు.నిందితుడు కాల్పులు జరపడంతో కూర్చొని ప్రసంగిస్తున్న చార్లీ కిర్క్‌ మెడ భాగంలో తూటా దిగింది. తీవ్ర గాయం కావడంతో చార్లీ నేలకొరిగాడు.   

చార్లీ కిర్క్ బుధవారం యుటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులు, అనుచరులతో మాట్లాడుతున్న సమయంలో  హత్యకు గురయ్యాడు. యుటా వ్యాలీ యూనివర్సిటీ పోలీస్‌ అధికారి చార్లీకిర్క్‌ హత్య అనంతరం మీడియాతో మాట్లాడారు.

చార్లీ ఈవెంట్‌లో మూడువేల మంది
చార్లీ కిర్క్‌ ఈవెంట్‌లో సుమారు 3వేలమంది పాల్గొన్నారు. మాటీంలో ఆరుగురు సభ్యులు ఈవెంట్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చార్లీకి సెక్యూరిటీగా తన వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. ఈవెంట్‌ జరిగే సమయంలో చార్లీ క్యాంపస్‌లో లోతట్టు ప్రదేశంలో ప్రసంగిస్తున్నారు. ఆ సమయంలో నిందితుడు చార్లీ కూర్చున్న ప్రదేశం నుంచి సుమారు 200 అడుగుల దూరంలో ఉన్న బిల్డింగ్‌ పైకప్పు నుంచి కాల్పులకు తెగబడ్డారని అన్నారు. 

లక్ష డాలర్ల రివార్డు
కాల్పుల ఘటనపై అప్రమత్తమైన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు 48 గంటల్లో నిందితుణ్ని అదుపులోకి తీసుకుంది. ఇందుకోసం సుమారు 20కిపైగా ఏజెన్సీలు,వందల మంది వందలాది మంది అధికారులు.. 7వేల మందికి పైగా ప్రజల సహాయంతో రంగంలోకి దిగారు.నిందితుణ్ని అరెస్ట్‌ చేశారు.నిందితుడి ఆచూకీ, అరెస్ట్‌ చేసేలా సమాచారం ఇచ్చిన వారికి లక్ష డాలర్ల రివార్డు ఇస్తామని ఎఫ్‌బీఐ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement