యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు | Bill opposing war passed in the US Senate | Sakshi
Sakshi News home page

యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్‌లో నెగ్గిన బిల్లు

May 20 2026 8:01 PM | Updated on May 20 2026 8:21 PM

Bill opposing war passed in the US Senate

వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్‌తో యుద్ధం విషయంలో కాంగ్రెస్‌ ట్రంప్‌పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.

ఇరాన్‌తో యుద్ధం ట్రంప్‌ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్‌పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్‌ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.

ఇరాన్‌పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్‌ సెనేటర్ టిమ్‌ కెయిన్‌ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్‌లో ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్‌లో నెగ్గింది.

అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్‌లో ఓటింగ్‌ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉ‍న్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్‌, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్‌పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.

అమెరికా చట్టం ఏం చెబుతుంది.
అమెరికా రాజ్యాంగం  ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. 

అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్‌ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్‌లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement