ప్రధాని మోదీకి బిల్‌గేట్స్‌ అభినందనలు | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి బిల్‌గేట్స్‌ అభినందనలు

Published Wed, Jul 20 2022 7:12 AM

Bill Gates Congratulate PM Modi Over India 200 Crores Vaccination - Sakshi

సియాటెల్: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌.. భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారత్‌లో 200 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల ప్రక్రియ పూర్తైనందునా అభినందించారు బిల్‌గేట్స్‌. 

ఈ మేరకు ఓ వార్త కథనాన్ని ట్యాగ్‌ చేసి మరీ ట్విటర్‌లో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. భారత వ్యాక్సిన్‌ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నాం అని ట్వీట్‌ చేశారాయన.

ఇక ప్రధాని మోదీ ఆదివారం నాడు భారత్‌ మరో చరిత్ర సృష్టించిందంటూ వ్యాక్సినేషన్‌పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బూస్టర్‌ డోసులను సైతం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ప్రజలకు అందిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement