బంగ్లాదేశ్‌ మహిళా జర్నలిస్టు విడుదల

Bangladesh Journalist Rozina Islam Was Released From Jail On Sunday - Sakshi

ఢాకా: దాదాపు వారం క్రితం అరెస్టయిన బంగ్లాదేశ్‌ సీనియర్‌ మహిళా జర్నలిస్టు రోజినా ఇస్లామ్‌ ఆదివారం విడుదలయ్యారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అనుమతి లేకుండా ఫోటోలు తీశారన్న ఆరోపణలపై వలసవాద కాలానికి చెందిన ఓ చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుపై బంగ్లాదేశ్‌లోని మీడియా సహా ఐక్యరాజ్యసమితి వరకూ పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని ఓ కోర్టు ఆమెకు బెయిల్‌ ఇచ్చింది. 5వేల టాకాలను పూచీకత్తుగా ఇవ్వాలని, పాస్‌పోర్టును సమర్పించాలని కోర్టు ఆమెను కోరింది.

అనంతరం కాశీంపుర్‌ మహిళా సెంట్రల్‌ జైలు నుంచి ఆదివారం రోజినా  విడుదలయ్యారు. జూలై 15వరకూ బెయిల్‌ కొనసాగనుంది. వ్యాక్సిన్లను కొనే వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఆమె ఫొటోలు తీశారంటూ ఆరోగ్య శాఖ ఆమెపై కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తాను ఇకపై కూడా జర్నలిస్టుగా మరింత బాధ్యతతో పని చేస్తానని చెప్పారు.

(చదవండి: UN Chief: కరోనా మహమ్మారి మనతోనే ఉంది)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top