పాకిస్తాన్ ప్రధాని మంత్రి షెహబాజ్ షరీప్, ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునిర్‌లు.. ఇప్పుడు అమెరికాకు అత్యంత ఆప్త మిత్రులు అంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్థానంలో మునిర్.. రెండు దఫాలు అమెరికా పర్యటనకు వెళ్లొచ్చారు. ఇక పాక్ ప్రదాని షరీఫ్ కూడా ఒక దఫా అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి తాము అమెరికా పర్యటనకు వెళ్చొచ్చినట్లు వారు స్పష్టం చేశారు.
అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మునిర్‌తో కలిసి ప్రత్యేక విందులో పాల్గొనడం. భారత్‌పై అక్కసుతోనే ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రపంచానికి అర్ధమవుతూ వచ్చింది.
గతంలో పాక్ పెంచి పోషించిన ఉగ్రవాది బిన్ లాడెన్.. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి చేసిన తర్వాత.. ఆ దేశాన్ని అమెరికా దూరం పెడుతూ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో పాకిస్తాన్‌కు ఎక్కువ సీన్ క్రియేట్ చేస్తున్నారు ట్రంప్. ఆపరేషన్ సిందూర్‌ను ఆపింది తానేనని పదేప దే చెప్పుకుంటూ, పాకిస్తాన్‌కు అత్యంత ప్రయారిటీ ఇచ్చారు ట్రంప్.
వారిద్దర్నీ బ్యాన్ చేయండి
ప్రధాని షెహబాజ్ షరిఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌లను బ్యాన్ చేయాలనేది అమెరికా ఎంపీల డిమాండ్. దీనికి సంబంధించి యూఎస్ కాంగ్రెస్ సభ్యులు 44 మంది.. విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియోకు లేఖ రాశారు. ప్రధాని, ఆర్మీ చీఫ్‌లను తక్షణమే బ్యాన్ చేయాలంటూ లేఖ రాశారు. పాకిస్తాన్‌లో ఆర్మీ పాలన సాగుతుందని, ఇది ప్రజల హక్కులను ఉల్లంఘించడమేని వారు పేర్కొన్నారు. అటువంటి దేశంతో మనకి మిత్రత్వం ఏమిటి లేఖలో ప్రస్తావించారు. డెమెక్రాటిక్ ఎంపీ ప్రమీలా జయపాల్, గ్రెగ్ కాసర్‌లు ఆధ్వర్యంలో ఈ లేఖ రాసి.. విదేశాంగ కార్యదర్శికి పంపారు.
మరి ట్రంప్ యాక్షన్ ఏమిటో?
దీనిపై ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రతీదానికి పాకిస్తాన్‌ను వెనకేసుకొస్తున్న ట్రంప్.. ఇప్పుడు ఆ దేశ ఎంపీల డిమాండ్ ఏం చేస్తారనేది ఆసక్తికరం. తన పంథాను మార్చుకుంటారా.. లేక పాక్‌తో అదే స్నేహాన్ని కొనసాగిస్తారనేది చర్చనీయాంశమైంది. భారత్‌ను భయపెట్టాలని పాకిస్తాన్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న ట్రంప్‌కు సొంత దేశంలోనే నిరసన సెగ ఎదురుకావడం, అందులోనూ అది ఎంపీల నుంచి రావడంతో ట్రంప్‌ను ఇది కచ్చితంగా ఆలోచనలో పడేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


